News April 26, 2024

మెదక్: సోషల్ మీడియాలో ప్రచార జోరు..

image

ఒకప్పుడు ఎన్నికలు వచ్చాయంటే ఆర్భాటాలు, ర్యాలీలు, మైకుల హోరు, ప్రచార వాహనాల జోరు ఉండేది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో సోషల్ మీడియా ప్రచారం జోరందుకుంది. ర్యాలీలు, కార్నర్ మీటింగ్‌, అగ్రనాయకులను రప్పిస్తూ ప్రచారంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. ఉదయం వాకింగ్‌లో యువతను పలకరిస్తున్నారు. ఇంటింటి ప్రచార బాధ్యతలను స్థానిక నేతలే చూసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది.

Similar News

News April 16, 2026

మెదక్: రైతు బంధు నిలిపివేయడంపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

image

రైతులకు రావాల్సిన రైతు బంధు నిలిపివేయడంపై తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మెదక్ జిల్లా నార్సింగి మండలం శంకాపురం గ్రామానికి చెందిన పిటిషనర్ల భూములకు సంబంధించి రైతు బంధు మొత్తాలు నిలిపివేయడం, పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం చట్టవిరుద్ధమని ప్రాథమికంగా గుర్తించిన న్యాయస్థానం, కలెక్టర్ సహా సంబంధిత అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

News April 16, 2026

మెదక్: TUWJ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో జిల్లా కమిటీ

image

షామీర్పేట్‌లో TUWJ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు శంకర్ దయాల్ చారి, ప్రధాన కార్యదర్శి సంతోష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు టీజీ శ్రీనివాస శర్మ పాల్గొన్నారు. జర్నలిస్టుల సంక్షేమం, రాష్ట్ర, జిల్లాల్లో ఎదురవుతున్న వివిధ వృత్తిపరమైన సమస్యలపై నేతలు సుదీర్ఘంగా చర్చించారు. యూనియన్ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

News April 16, 2026

MDK: డిప్లొమా కోర్సుల్లో అనాథ బాలికలకు 70% సీట్లు: కలెక్టర్

image

HYDలోని ప్రభుత్వ మహిళా సాంకేతిక విద్యా సంస్థలో అనాథ, నిరుపేద బాలికలకు డిప్లొమా కోర్సుల్లో 70 శాతం సీట్లు కేటాయించినట్లు కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. సివిల్, CSE, ECE, EEE విభాగాల్లో మూడేళ్ల డిప్లొమా కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. పదో తరగతి ఉత్తీర్ణులైన వారు పాలిసెట్ (POLYCET) ద్వారా ప్రవేశం పొందవచ్చని, ఆసక్తి గల వారు మరిన్ని వివరాలకు వెబ్‌సైట్‌ను సందర్శించాలని కలెక్టర్ సూచించారు.