News November 19, 2025
మెదక్: ‘స్థానికం’పై చిగురిస్తున్న ‘ఆశలు’

42% రిజర్వేషన్లపై ఎన్నికలు నిర్వహించవద్దని సుప్రీంకోర్టు, హైకోర్టు సూచించింది. దీంతో ప్రభుత్వం రిజర్వేషన్లు మార్చి ఎన్నికలకు ముందుకు వెళుతుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆశావహుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. నవంబర్లో నోటిఫికేషన్ ఇచ్చి.. డిసెంబర్లో ఎన్నికలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తుంది. మీ ప్రాంతంలో పరిస్థితి ఎలా ఉందో కామెంట్ చేయండి.
Similar News
News January 19, 2026
‘క్వాంటమ్’ కోర్సులో 50,000 మంది AP యువత

AP: క్వాంటమ్ కంప్యూటింగ్ కోర్సుకు రాష్ట్ర యువత నుంచి అధిక స్పందన లభిస్తోంది. NPTEL ప్లాట్‌ఫామ్ ద్వారా మద్రాస్ IIT, IBM అందిస్తున్న ఈ కోర్సులో 50,000 మంది ఎన్రోల్ అయ్యారు. దేశంలోనే AP ఈ అంశంలో ముందంజలో ఉంది. అటు IITల సహకారంతో 7-9 తరగతుల్లో క్వాంటమ్ పరిజ్ఞానంపై అవగాహన పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టింది. ఈకోర్సులో గోల్డ్, సిల్వర్ మెడలిస్టులను సత్కరించనున్నామని CBN Xలో పేర్కొన్నారు.
News January 19, 2026
గాజువాకలో పండుగ దెబ్బ.. రెచ్చిపోయిన దొంగలు

గాజువాకలోని దొంగలు పండుగ దెబ్బ చూపించారు. 70వ వార్డు ఎల్బీనగర్‌లో ఒకే వరుసులో ఉన్న మూడు ఇళ్లలో దొంగలు చోరీలకు పాల్పడ్డారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గాజువాక క్రైమ్ సీఐ, ఇతర బృందం చేరుకుని వేలిముద్రలు సేకరిస్తున్నారు. ఈ మూడు ఇళ్లలో ఎవరూ లేకపోవడంతో ఏం చోరీ జరిగిందనే విషయం తెలియరాలేదు. యజమానులకు పోలీసులు సమాచారం అందించారు. సీసీ పుటేజులు పరిశీలిస్తున్నారు.
News January 19, 2026
WGL: అనాథ బాలికలకు అండగా ఎస్సై!

జిల్లాలోని నెక్కొండ మండలం పెద్దకొర్పోల్‌లో ఇటీవల ఏలియా, మమత దంపతులు మరణించడంతో వారి ఇద్దరు కుమార్తెలు అనాథలయ్యారు. ఈ విషాద ఘటన నెక్కొండ ఎస్సై మహేందర్‌ను కదిలించింది. వారి భవిష్యత్తుపై ఆందోళన చెందిన ఆయన, బాలికలకు అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు. తన సొంత ఖర్చులతో ఇద్దరు పిల్లల కోసం రెండు గదుల ఇంటిని నిర్మిస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు సోమవారం గ్రామంలో స్వయంగా ముగ్గు పోసి భూమి పూజ నిర్వహించారు.


