News November 19, 2025

మెదక్: ‘స్థానికం’పై చిగురిస్తున్న ‘ఆశలు’

image

42% రిజర్వేషన్లపై ఎన్నికలు నిర్వహించవద్దని సుప్రీంకోర్టు, హైకోర్టు సూచించింది. దీంతో ప్రభుత్వం రిజర్వేషన్లు మార్చి ఎన్నికలకు ముందుకు వెళుతుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆశావహుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. నవంబర్లో నోటిఫికేషన్ ఇచ్చి.. డిసెంబర్లో ఎన్నికలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తుంది. మీ ప్రాంతంలో పరిస్థితి ఎలా ఉందో కామెంట్ చేయండి.

Similar News

News January 23, 2026

ఓటు హక్కు వజ్రాయుధం: కలెక్టర్

image

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైన వజ్రాయుధమని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి అర్హత గల పౌరుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకుని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జితేష్
వి. పాటిల్ పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో 16వ జాతీయ ఓటర్ల దినోత్సవ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. దేశంలో ఓటు హక్కుకు ఎంతో విలువ ఉందన్నారు.

News January 23, 2026

GNT: సమగ్రశిక్షలో ఖాళీకి దరఖాస్తుల ఆహ్వానం

image

గుంటూరు సమగ్రశిక్ష కార్యాలయంలో అసిస్టెంట్ ఆల్టర్నేటివ్ స్కూలింగ్ కోఆర్డినేటర్ ఖాళీ భర్తీకి ఫారిన్ సర్వీస్ నిబంధనల ప్రకారం డిప్యూషన్ పై పనిచేయుటకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు DEO సలీమ్ బాషా తెలిపారు. 55 సం.ల లోపు కలిగిన ప్రభుత్వ, జడ్పీ, మున్సిపల్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు 5సం.ల సర్వీస్, సెకండరీ గ్రేడ్ టీచర్లు 8 సం.ల సర్వీస్ కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

News January 23, 2026

నాగర్‌కర్నూల్ జిల్లాలో సమృద్ధిగా యూరియా నిల్వలు

image

నాగర్‌కర్నూల్ జిల్లాలో ప్రస్తుతం 992 టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయని, రైతులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. ఈ నెలలో అదనంగా 3,026 టన్నుల సరఫరా రానుందని పేర్కొన్నారు. ఇప్పటికే 22,175 టన్నుల యూరియా పంపిణీ జరిగిందని, నిల్వలు సరిపడా అందుబాటులో ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.