News April 14, 2024
మెదక్: 30 రోజులు నా కోసం కష్టపడండి: వెంకట్రామరెడ్డి

కలెక్టర్‌గా ఇక్కడికి 100 సార్లు వచ్చానని, నేడు ఎంపీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్న నన్ను ఆశీర్వదించాలని ఎంపీ అభ్యర్థి, మాజీ కలెక్టర్, ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి కోరారు. జగదేవపూర్‌లో జరిగిన జగదేవపూర్, మర్కుక్ మండల బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్సీ వంటేరు యాదవ రెడ్డి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డితో కలిసి మాట్లాడారు. వచ్చే 30 రోజుకు నా కోసం కష్టపడాలని కార్యకర్తలను కోరారు.
Similar News
News December 6, 2025
మెదక్: అప్పు ఎంతైనా పర్వాలేదు.. గెలవాలంతే!

మెదక్ జిల్లా వ్యాప్తంగా ఈనెల 11, 14, 17వ తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ తేదీలు దగ్గర పడుతున్న కొద్ది జిల్లాల్లో ఎన్నికల వేడి రాజుకుంటోంది. పలు పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా కాసుల వేట కొనసాగిస్తున్నారు. ఎక్కువ అభ్యర్థులు పోటీ చేసే జనరల్ స్థానాల్లో ఈ ధోరణి తారస్థాయిలో ఉంది. కొంతమంది అభ్యర్థులు అయితే తమ వద్ద డబ్బులు లేక అప్పులు చేసి మరి ఖర్చు పెడుతున్నారు.
News December 5, 2025
పోస్టల్ బ్యాలెట్ అందజేయాలి: అదనపు కలెక్టర్ నగేష్

పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోస్టల్ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్క ఎన్నికల సిబ్బందికి తప్పనిసరిగా ఓటింగ్ సౌకర్యం కల్పించాలని అదనపు కలెక్టర్ నగేష్ సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నోడల్ అధికారులతో సమావేశమై, వారికి కేటాయించిన విధులను సమర్థంగా నిర్వహించేందుకు తగిన సూచనలు, సలహాలు అందించారు. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు.
News December 5, 2025
నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు: ఎస్పీ

మూడో విడత స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ ప్రక్రియ చివరి రోజును దృష్టిలో ఉంచుకుని పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు తెలిపారు. నామినేషన్ ప్రక్రియ జరుగుతున్న గ్రామ పంచాయతీలు, వార్డుల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు భద్రతా చర్యలు తీసుకున్నామని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఎస్పీ కొల్చారం ఎంపీడీఓ కార్యాలయాన్ని సందర్శించారు.


