News January 15, 2026

మెనోపాజ్‌లో ఒత్తిడి ప్రభావం

image

మెనోపాజ్‌ దశలో శరీరంలో తలెత్తే హార్మోన్ల మార్పుల కారణంగా మానసిక ఆరోగ్యంపైనా ప్రభావం పడుతుంది. దీంతో ఒత్తిడి, ఆందోళన, చిరాకు, మూడ్‌ స్వింగ్స్‌ వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటిని అధిగమించే మార్గాల గురించి నిపుణులను, తోటి మహిళలను అడిగి తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి నచ్చిన పనులు చేయడం, కంటి నిండా నిద్ర పోవడం వంటివి చేయాలని సూచిస్తున్నారు.

Similar News

News February 18, 2026

ఇంటి నుంచే లైఫ్ సర్టిఫికెట్ అప్లై చేసుకోండి

image

పెన్షనర్లకు లైఫ్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయడం అతిపెద్ద టాస్క్. దీనికి బ్యాంకులు/ పోస్టాఫీసుల్లో క్యూలో నిలబడాల్సిన పనిలేకుండా ఆన్‌లైన్‌లోనూ చేసుకోవచ్చు. జీవన్ ప్రమాణ్ యాప్‌తో పాటు ఫేస్ అథెంటికేషన్ కోసం AadhaarFaceRD యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. మీ ఆధార్ నంబర్, పెన్షన్ పేమెంట్ ఆర్డర్ నంబర్, బ్యాంక్ వివరాలు ఇవ్వాలి. బయోమెట్రిక్ వెరిఫికేషన్ పూర్తయ్యాక సర్టిఫికెట్ ఆటోమెటిక్‌గా సంబంధిత బ్యాంక్‌కు వెళ్తుంది.

News February 18, 2026

CSIR-IICBలో ఉద్యోగాలు

image

కోల్‌కతాలోని CSIR-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ(I<>ICB<<>>) 9 పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టును బట్టి పీజీ(నేచురల్ /అగ్రికల్చర్ సైన్సెస్/MVSc/ఎనిమల్ సైన్సెస్/ఫార్మాస్యూటికల్ సైన్సెస్), BSc(హానర్స్), MSc, PhD, BE/BTech, MCA, NET/SET అర్హతతో పాటు పని అనుభవం గలవారు ఫిబ్రవరి 27న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. వెబ్‌సైట్: https://iicb.res.in

News February 18, 2026

కాంగ్రెస్‌లో రాజ్యసభ సీట్లు దక్కేదెవరికో?

image

TG: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ వెలువడ్డంతో రాష్ట్రంలోని 2 సీట్లు ఎవరికి దక్కుతాయనే చర్చ జోరందుకుంది. MLAల సంఖ్య ప్రకారం INCకే ఇవి దక్కవచ్చంటున్నారు. ఆ పార్టీ నుంచి K.కేశవరావు, అభిషేక్ సింఘ్వీ, జీవన్ రెడ్డి, హనుమంతరావు, సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీల పేర్లు వినిపిస్తున్నాయి. గతంలో BRS RS సభ్యుడిగా ఉన్న KK రాజీనామా చేసి INCలో చేరారు. VH, జీవన్, సుదర్శన్‌లు సీనియర్లు. సింఘ్వీ AICCలో కీలకంగా ఉన్నారు.