News April 25, 2024
మెరిసిన విజయవాడ IFS అధికారి

విజయవాడకు చెందిన IFS అధికారి అబ్దుల్ రవూఫ్ తెలుగువారి ఖ్యాతిని పెంచారు. సివిల్స్ ప్రిపేర్ అయిన ఇతను మూడో ప్రయత్నంలో IFSకు సెలక్ట్ అయ్యారు. 2022-24 శిక్షణ సమయంలో వృత్తిపరమైన శిక్షణ కోర్సులో మంచి ప్రతిభ కనబరిచి 7 బంగారు పతకాలు సాధించారు. బుధవారం డెహ్రడూన్‌లోని ఇందిరా గాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా వీటిని అందుకున్నారు.
Similar News
News April 14, 2026
కృష్ణా: పీజీఆర్ఎస్‌కు 132 అర్జీలు

పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని సోమవారం మచిలీపట్నం కలెక్టరేట్‌లో నిర్వహించారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ నవీన్‌కు అందించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 132 అర్జీలు అందినట్టు అధికారులు తెలిపారు. శాఖల వారీగా అర్జీలను విభజించి ఆయా శాఖల అధికారులకు పరిష్కారం నిమిత్తం బదిలీ చేశామన్నారు.

భూగర్భజలాల పెంపునకు చర్యలు చేపట్టండి: కలెక్టర్

జిల్లాలో జలధార పథకం కింద భూగర్భ జలాల మట్టం పెంపుదలకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జలధార కార్యాచరణ ప్రణాళికపై సోమవారం మచిలీపట్నం కలెక్టరేట్ మీటింగ్ హాలులో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అన్ని చెరువుల పూడికలను ఉపాధి హామీ పథకం కింద తీసేందుకు మంజూరు ఉత్తర్వులు సిద్ధం చేయాలన్నారు.