News October 6, 2025

మెళియాపుట్టి: కరెంట్ షాక్‌తో 30 ఏళ్ల యువకుడి మృతి

image

ఇంటిపై చెట్టు కొమ్మలను తొలగిస్తుండగా కరెంటు షాక్‌తో ఓ యువకుడు సోమవారం మృతి చెందాడు. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. మెళియాపుట్టి(M) గంగరాజపురం గ్రామానికి చెందిన చంటి(30) ఇంటిపై చెట్టు కొమ్మలను తొలగిస్తుండగా ప్రమాదవశాత్తూపై కప్పునకు ఉన్న కరెంట్ వైర్ తగిలి మరణించాడు. అక్క దమయంతి ఫిర్యాదుతో ఎస్ఐ రమేష్ బాబు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి పాతపట్నం ఆసుపత్రికి తరలించారు.

Similar News

News January 17, 2026

నేడు సిక్కోలు రచయిత చాసో జయంతి

image

సిక్కోలు గడ్డపై జన్మించిన ప్రముఖ రచయిత చాగంటి సోమయాజులు (చాసో) జయంతి నేడు. 1915 జనవరి 17న శ్రీకాకుళంలో జన్మించిన ఆయన, సామాన్యుల జీవితాలను తన కలంతో అద్భుతంగా ఆవిష్కరించారు. 1942లో ‘చిన్నాజీ’ కథతో ప్రయాణం మొదలుపెట్టి, ఐదు దశాబ్దాల కాలంలో 46కు పైగా ఆణిముత్యాల్లాంటి కథలను తెలుగు సాహిత్యానికి అందించారు. వాడుక భాషా కథలకు ప్రాణం పోసిన ఆయన రచనలు నేటికీ ఎంతో ప్రాచుర్యంలో ఉన్నాయి. 1994 జనవరి 1న మరణించారు.

News January 17, 2026

రణస్థలంలో యాక్సిడెండ్..యువకుడు స్పాట్ డెడ్

image

శ్రీకాకుళం జిల్లా రణస్థలం జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయనగరం జిల్లా తమ్మాపురం గ్రామానికి చెందిన కోటి(25) అనే యువకుడు మృతిచెందాడు. స్థానికుల వివరాలు మేరకు..తల్లిని శ్రీకాకుళం ఆసుపత్రికి తీసుకువెళ్లి తిరిగి విజయనగరానికి బైక్‌పై వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొనడంతో అక్కడిక్కడే మృతిచెందాడు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. జె.ఆర్‌పురం పోలీసులు కేసు నమోదు చేశారు.

News January 17, 2026

శ్రీ సూర్యనారాయణ స్వామి శోభా యాత్ర వాయిదా: కలెక్టర్

image

అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థాన రథసప్తమి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 19న జరగాల్సిన ‘శోభాయాత్ర’ను 23వ తేదీకి మారుస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ మృతికి సంబంధించిన సంతాప దినాలు జరుగుతున్నందున వాయిదా వేసినట్లు తెలిపారు. భక్తుల దర్శనానికి తగిన ఏర్పాట్లు చేశామన్నారు.