News December 1, 2025

మేడారంలో ఏ చిన్న పొరపాటు జరిగినా చర్యలు తప్పవు: సీఎం

image

మేడారం జాతర ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పనులలో ఏ చిన్న పొరపాటు జరిగినా కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. స్తపతి శివనాగిరెడ్డితో సమన్వయం చేసుకుంటూ, సంప్రదాయాలు పాటిస్తూ నిర్దేశిత సమయానికి పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యుత్, రోడ్లు, భక్తుల విడిది, దర్శన ఏర్పాట్లపై ప్రధానంగా చర్చించారు.

Similar News

News February 18, 2026

ఈక్రాప్ నమోదును వేగంగా పూర్తి చేయాలి: నెల్లూరు కలెక్టర్

image

ఈ క్రాప్ నమోదును వేగంగా పూర్తిచేయాలని నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఇందుకూరుపేట మండలం కొరుటూరు పంచాయతీలో ఆన్‌లైన్‌లో నమోదు చేసిన పంట వివరాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ-పంట యాప్ నుంచి రైతుల వివరాలను డౌన్లోడ్ చేసుకొని నమోదు చేసేటప్పుడు ఆధార్ ఫోన్ నెంబర్ సరిచూడాలన్నారు. రైతు గండవరపు అమర్నాథ్ రెడ్డి, గ్రామ వ్యవసాయ సహాయకురాలు ఝాన్సీ పాల్గొన్నారు.

News February 18, 2026

NZB: పసుపు రైతు అభివృద్ధే దేశాభివృద్ధి: పసుపు బోర్డు ఛైర్మన్

image

పసుపు రైతుల అభివృద్ధే దేశాభివృద్ధి అని జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఢిల్లీలో టర్మరిక్ బోర్డు మీటింగ్‌లో ఆయన పాల్గొన్నారు. దేశంలోని పసుపు రైతుల సంక్షేమం, ఎగుమతుల విస్తరణ, అంతర్జాతీయ మార్కెట్‌లో భారత పసుపు బ్రాండ్ బలోపేతం వంటి అంశాలపై చర్చించినట్లు ఆయన తెలిపారు. పసుపు రైతుల భవిష్యత్తు బలోపేతం కావాలంటే ప్రభుత్వ, రైతు, వ్యాపార వర్గాల సమన్వయం అత్యవసరమని అన్నారు.

News February 18, 2026

జగిత్యాల: ‘ఉపాధి కల్పన కార్డుకు నమోదు చేసుకోవాలి’

image

విద్యార్థులు ఉపాధి కల్పన కార్డుకు నమోదు చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి సత్యమ్మ పేర్కొన్నారు. జగిత్యాల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో కెరీర్ గైడెన్స్, ఉపాధి కల్పన కార్డు నమోదు కార్యక్రమంపై బుధవారం విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులకు భవిష్యత్తులో ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించారు. సిబ్బంది లైన కుమారి, ప్రసన్న, సదానందం లు రిజిస్ట్రేషన్ ప్రక్రియను విద్యార్థులకు చూపించారు.