News January 11, 2026

మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు

image

TG: మేడారం జాతరకు వచ్చే భక్తులకు వైద్యపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది. అన్ని రూట్లలో మెడికల్ క్యాంపులు ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి రాజనర్సింహ ఆదేశించారు. TTD కళ్యాణ మండపంలో 50 పడకలతో ప్రధాన ఆస్పత్రి, మరో రెండు చోట్ల మినీ హాస్పిటళ్లు, మొత్తం 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. 35 అంబులెన్సులు, 3,199 మంది సిబ్బంది అందుబాటులో ఉండనున్నారు.

Similar News

News January 23, 2026

మోదీకి మద్దతు ఎందుకు: YS షర్మిల

image

AP: రాష్ట్రానికి ఆర్థిక సాయం చేయడంలోనూ, అమరావతికి రాజధాని హోదా కల్పించడంలోనూ మోదీ ప్రభుత్వం తాత్సారం చేస్తోందని APCC చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. VB-G RAM G బిల్లులోని 60:40 విధానం వలన ఏపీపై భారం పడుతుందంటూనే మరోవైపు సాయం కోరడంపై ఆగ్రహించారు. తొలుత బిల్లుకు ఎలా మద్దతు ఇచ్చారని ప్రశ్నించారు. మోదీకి చంద్రబాబు మద్దతు కొనసాగించడం ఎందుకని ప్రశ్నించారు. వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.

News January 23, 2026

మేడారం జాతరకు కేంద్రం నిధులు విడుదల

image

TG: మేడారం జాతరకు కేంద్రం రూ.3.70 కోట్లు విడుదల చేసింది. ఈ నెల 28 నుంచి జరగనున్న వేడుకల్లో వసతుల కోసం అధికారులు వీటిని ఖర్చు చేయనున్నారు. కాగా ఇప్పటికే కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మేడారం చుట్టుపక్కల ఉన్న ములుగు, లక్నవరం, తాడ్వాయి, దామరవాయి, మల్లూరు, బొగత జలపాతం వంటి ప్రాంతాల్లో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ‘గిరిజన సర్క్యూట్ పేరిట’ రూ.80 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టింది.

News January 23, 2026

త్వరలో బీజేపీలోకి శశిథరూర్?

image

కేరళ అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ హైకమాండ్ ఢిల్లీలో నిర్వహించిన కీలక భేటీకి పార్టీ MP శశిథరూర్ గైర్హాజరయ్యారు. అదే సమయంలో తిరువనంతపురంలో జరిగిన PM మోదీ సమావేశానికి హాజరయ్యారు. ఇప్పటికే మోదీ పాలనను ప్రశంసించిన థరూర్‌ను INC దూరం పెట్టినట్లు ప్రచారం ఉంది. ఇటీవల రాహుల్ ఓ ప్రసంగంలో తన పేరును విస్మరించడంతో థరూర్ అసంతృప్తిగానూ ఉన్నారు. ఈ పరిణామాలతో ఆయన త్వరలోనే BJPలో చేరొచ్చన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి.