News February 8, 2025
మేడారానికి బస్సు ప్రారంభం

మినీ మేడారం జాతర సందర్భంగా భక్తులకు బస్సు సర్వీస్ ప్రారంభమైంది. ఈ నెల 12 నుంచి 15వ తేదీ వరకు జరిగే మినీ మేడారం జాతరకు హనుమకొండ నుంచి తాడ్వాయి మీదుగా ప్రతి రోజు 6 ట్రిప్పులు బస్సులు నడపనున్నట్లు ఆర్ఎం తెలిపారు. మహిళలకు ఉచిత ప్రయాణం ఉందని భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. మంత్రి సీతక్క చొరవతో మహా జాతరకు బస్సు సౌకర్యం ఉన్నట్లు మినీ జాతరకు కూడా బస్సులు ఏర్పాట్లు చేశారు.
Similar News
News February 19, 2026
ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్‌లో 43 పోస్టులు.. అప్లై చేశారా?

ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ (<
News February 19, 2026
గుంటూరు: యువతకు బంపరాఫర్.. ఉచితంగా శిక్షణ

Ratan TATA ఇన్నోవేషన్ హబ్ ఆధ్వర్యంలో ఎలక్ట్రికల్ కార్ల డ్రైవర్లుగా ఉచిత శిక్షణ ఇవ్వడంతో పాటు ఉపాధి కల్పించనున్నట్లు తాడికొండ MLA కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఇంటర్మీడియట్ అర్హత, 18-30 సంవత్సరాలు కలిగిన పురుషులు, మహిళలు అర్హులని చెప్పారు. ఆసక్తి కలిగిన యువత పూర్తి వివరాలకు 83096 07418ను సంప్రదించాలని కోరారు.
News February 19, 2026
వరి మాగాణి మినుములో ఎండు తెగులు

ఎండు తెగులు ఆశించిన మినుము మొక్కలు వడలి, ఎండి పంటకు నష్టం వాటిల్లుతుంది. భూమిలోని శిలీంధ్రం ద్వారా ఈ తెగులు వ్యాపిస్తుంది. దీని నివారణకు పంట మార్పిడితో పాటు పొలంలో నీరు నిల్వలేకుండా చూడాలి. పైరు విత్తే ముందు kg విత్తనానికి 3గ్రా. కార్బెండజిమ్ పట్టించి విత్తాలి. ఎకరాకు 80kgల చివికిన పశువుల ఎరువు+20kgల వేపపిండిలో 2kgల ట్రైకోడెర్మావిరిడె జీవశిలీంధ్రాన్ని కలిపి విత్తే సమయంలో భూమిలో కలియదున్నుకోవాలి.


