News May 7, 2025
మేడిపల్లి: ఉరేసుకొని RMP ఆత్మహత్య

మేడిపల్లికి చెందిన RMP సాంబారు జగదీశ్(44) శుక్రవారం ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల వివరాలు.. కోన ఊపిరితో ఉన్న సమయంలో గమనించిన కుటుంబ సభ్యులు జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు పరిశీలించి అప్పటికే మరణించినట్లు తెలిపారు. జగదీశ్ గత మూడేళ్లుగా మెడ నొప్పితో బాధపడుతున్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News February 18, 2026
కష్ణా: మూగబోయిన నాడు-నేడు ప్యూరిఫైర్లు

ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు శుద్ధ తాగునీటిని అందించేందుకు వైసీపీ హయాంలో అమలు చేసిన నాడు-నేడు పథకంలో ఏర్పాటు చేసిన నీటి శుద్ధి యంత్రాలు జిల్లా వ్యాప్తంగా ఒక్కటి కూడా పనిచేయని పరిస్థితి నెలకొంది. గతంలో ఈ యంత్రాల నిర్వహణకు ప్రభుత్వం పాఠశాలలకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసింది. ఐనా మరమ్మతులు చేపట్టలేదని, వేసవికి మునుపే మరమ్మతులు చేసి పిల్లలకు తాగునీరు అందించాలని పేరెంట్స్ కోరుతున్నారు.
News February 18, 2026
వరంగల్: త్రి శక్తి పీఠం గుడి సాక్షిగా కాంగ్రెస్‌లో బయటపడ్డ వర్గ బేధాలు!

వరంగల్ గోపాల స్వామి గుడి సమీపంలోని త్రి శక్తీ పీఠం దేవాలయం కూల్చివేతను నిరసిస్తూ చేపట్టిన ఆందోళనలో కాంగ్రెస్‌లో వర్గ బేధాలు బయట పడ్డాయి. MLC బసవరాజు సారయ్య వర్గం నేతలంతా నిరసనలో పాల్గొనగా, కొండా వర్గం నేతలు నిరసన తెలుపుతున్న సారయ్య వర్గం వద్దకు వచ్చిన దేవాలయం కూల్చివేతను సమర్థిస్తూ వాగ్వాదానికి దిగారు. దీంతో అధికార కాంగ్రెస్‌లో వెలుగు చూసిన వర్గ భేదాలపై చర్చ మొదలైంది.
News February 18, 2026
ప్రెగ్నెన్సీలో బేబీ వెయిట్ పెంచే సూపర్ ఫుడ్స్ ఇవే..

ప్రెగ్నెన్సీలో తల్లి తీసుకొనే ఆహారాన్ని బట్టి బిడ్డ బరువు ఆధారపడి ఉంటుంది. కొన్నిసార్లు పిండం వెయిట్ తక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు కొన్ని ఆహారాలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. అవకాడో, గుడ్లు, పాలు, పాల పదార్థాలు, పప్పులు, నాన్ వెజ్, నట్స్, సీడ్స్, చిలగడదుంప వంటివి ఆహారంలో చేర్చుకుంటే కడుపులోని బిడ్డ బరువు పెరగడానికి సాయపడతాయంటున్నారు.


