News September 10, 2025

మేడ్చల్: ఐలమ్మ పోరాటం యువతకు ఆదర్శం: అ.కలెక్టర్

image

మేడ్చల్ కలెక్టరేట్‌లో చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అదనపు కలెక్టర్ రాధిక గుప్తా ఆమె చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులర్పించారు. సామాజిక సమానత్వం కోసం ఐలమ్మ చేసిన పోరాటం, ఆమె ధైర్య సాహసాలు నేటి యువతకు స్ఫూర్తినిస్తాయని ఆమె కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ, కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Similar News

News December 9, 2025

విదేశీ విద్యకు ఖమ్మం బీసీ స్టడీ సర్కిల్ చేయూత

image

విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే ఉమ్మడి జిల్లా విద్యార్థులకు ఖమ్మంలోని తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యాన IELTS ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ శ్రీలత తెలిపారు. శిక్షణతో పాటు స్కాలర్‌షిప్‌ పొందేలా మార్గనిర్దేశం చేస్తామని చెప్పారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులు ఈ నెల 21వ తేదీలోగా www.tgbcstudycircle.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.

News December 9, 2025

AU: పోస్టల్ సిబ్బంది ఉందని పోస్టాఫీస్!

image

విశాఖలో ఏయూ ప్రాంగణంలో మంగళవారం zen -z పోస్టల్ కార్యాలయం ప్రారంభించనున్నారు. ఈ పోస్ట్ ఆఫీస్‌లో పోస్టల్ సేవలకు సంబందించిన క్యూ ఆర్ కోడ్‌ల చిత్రాలు ఉంటాయి. నేరుగా కోడ్‌ను స్కాన్ చేసి వారికీ కావాల్సిన సేవలను వినియోగించుకోవచ్చు. ఇక్కడ పోస్టల్ సిబ్బంది ఎవ్వరూ ఉండరు. అవసరమైన సూచనలు ఇచ్చేందుకు ఒక సిబ్బంది మాత్రమే ఉంటారు. అయితే రాష్ట్రంలో విశాఖలో ఇదే మొదటి zen -z పోస్టల్ కార్యాలయం.

News December 9, 2025

పశ్చిమ ప్రకాశం వాసులకు తీరనున్న ప్రయాణ కష్టాలు

image

ఏపీ ప్రభుత్వం మార్కాపురం జిల్లా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఒకప్పుడు జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే యర్రగొండపాలెం (135 km), మార్కాపురం (98 km), కనిగిరి (92 km)కి దూరం ప్రయాణించాల్సి వచ్చేదని పశ్చిమ ప్రకాశం ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు నూతన మార్కాపురం జిల్లాలో కలిపిన నియోజకవర్గాలకు జిల్లా కేంద్రం 65(km)లోపే ఉంటుంది. గిద్దలూరుకు మాత్రం ఒంగోలుతో పోల్చుకుంటే మార్కాపురం దగ్గరే.