News November 19, 2025
మేడ్చల్: ‘కాలుష్యానికి కారణ భూతంగా.. ఈ పరిశ్రమలు..!

మల్లాపూర్, నాచారం, చర్లపల్లి, కీసర, ప్రశాంత్ నగర్, బొల్లారం, జీడిమెట్ల సహా పలు ప్రాంతాల్లో 60కి పైగా అనుమతులు లేని పరిశ్రమలు నడుస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ పరిశ్రమలు తమ రోజువారీ ఉత్పత్తుల సామర్థ్యం మేరకు వ్యర్థ ద్రవాల శుద్ధి సదుపాయాలు లేకుండానే యథేచ్ఛగా కొనసాగుతున్నట్లు తేలింది. ఇవే కాలుష్యానికి ప్రధాన కారణభూతంగా మారుతున్నాయని, వీటిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు.
Similar News
News January 24, 2026
సాగు నీళ్లకోసం రైతుల ఎదురుచూపులు: హరీశ్ రావు

ఉమ్మడి మెదక్ జిల్లా రైతుల కోసం ఎమ్మెల్యే హరీశ్ రావు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అన్నపూర్ణ, రంగనాయక, మల్లన్న, కొండ పోచమ్మ సాగర్‌ల ద్వారా ఐదు జిల్లాలకు సాగు, తాగు నీరు అందుతున్నట్లు గుర్తుచేశారు. యాసంగి పంటకు 3 లక్షల ఎకరాలకు నీరు ఉపయోగపడిందని, ఈ సంవత్సరం కూడా కాలువలు, చెక్ డ్యామ్‌ల ద్వారా భూగర్భ జలాలు పెంచి తక్షణమే నీరు విడుదల చేయమని కోరారు.
News January 24, 2026
రేపు ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం: కలెక్టర్

జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని విజయనగరం కలెక్టరేట్‌లో ఆదివారం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి శనివారం తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు. ముందుగా మహిళా పోలీస్ స్టేషన్ నుంచి కలెక్టరేట్ వరకు ఓటర్ల అవగాహన ర్యాలీ, అనంతరం ఆడిటోరియంలో ప్రధాన కార్యక్రమం జరుగుతుందన్నారు.
News January 24, 2026
ఇకపై హైరైజ్ బిల్డింగులకు TDR మస్ట్!

సిటీలో 10 అంతస్తులపైన కట్టే బిల్డింగులకు ప్రభుత్వం కొత్త రూల్ తీసుకొచ్చింది. 10వ అంతస్తు పైన నిర్మించే ఏరియాలో 10% ఖచ్చితంగా TDR ద్వారానే నింపుకోవాలి. అంటే బిల్డర్లు TDR సర్టిఫికెట్లను కొనుగోలు చేయడం తప్పనిసరి. దీనివల్ల టీడీఆర్ కార్డులు ఉన్నవారికి ఫుల్ డిమాండ్ పెరుగుతుంది. ఈ సర్టిఫికెట్లను ఇప్పుడు HMDA పరిధిలో ఎక్కడైనా వాడుకోవచ్చు. చెరువుల బఫర్ జోన్ స్థలాలకు ఇప్పుడు ఏకంగా 300% TDR ఇస్తున్నారు.


