News November 19, 2025

మేడ్చల్: ‘కాలుష్యానికి కారణ భూతంగా.. ఈ పరిశ్రమలు..!

image

మల్లాపూర్, నాచారం, చర్లపల్లి, కీసర, ప్రశాంత్ నగర్, బొల్లారం, జీడిమెట్ల సహా పలు ప్రాంతాల్లో 60కి పైగా అనుమతులు లేని పరిశ్రమలు నడుస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ పరిశ్రమలు తమ రోజువారీ ఉత్పత్తుల సామర్థ్యం మేరకు వ్యర్థ ద్రవాల శుద్ధి సదుపాయాలు లేకుండానే యథేచ్ఛగా కొనసాగుతున్నట్లు తేలింది. ఇవే కాలుష్యానికి ప్రధాన కారణభూతంగా మారుతున్నాయని, వీటిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు.

Similar News

News January 14, 2026

SV విద్యాదాన ట్రస్ట్‌కు రూ.10లక్షల విరాళం

image

చెన్నైకు చెందిన ధర లాజిస్టిక్స్ సంస్థ టీటీడీ శ్రీవేంకటేశ్వర విద్యాదాన ట్రస్ట్‌కు రూ.10 లక్షలు విరాళంగా అందించింది. ఆ సంస్థ ప్రతినిధులు టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి చేతుల మీదుగా తిరుమలలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు. దాతను ఆయన అభినందించారు.

News January 14, 2026

Next 7Daysలో వెండి పెరిగేనా? తగ్గేనా?

image

ఇవాళ $94-$95 ఉన్న ఔన్స్ (28.3గ్రా.) సిల్వర్ ఈ నెలలో 100$కు చేరొచ్చనేది మార్కెట్ విశ్లేషకుల మాట. ఈ లెక్కన Next 7 Days వైట్ మెటల్ రేట్ పెరుగుతుందని వారి అంచనా. USA ఫెడరల్ రిజర్వు నిర్ణయాలు, ట్రంప్ ఆదేశాలపై సుప్రీంకోర్టు విచారణ, ఇరాన్ ఉద్రిక్తతలు తదితర అంశాలు స్టాక్స్‌లో ఒడిదుడుకులు, మెటల్స్‌లో గ్రోత్‌కు కారణం కావచ్చు అని తెలిపారు.
⚠️ఈ ఆర్టికల్ కొనడం/అమ్మడం ప్రోత్సహించేందుకు కాదు. అవగాహన కోసమే.

News January 14, 2026

ఇంట్రెస్టింగ్ విషయం పంచుకున్న అనిల్ రావిపూడి

image

టాలీవుడ్ హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెలుగు ప్రజలకు భోగి శుభాకాంక్షలు చెబుతూ ఆసక్తికరమైన విషయం పంచుకున్నారు. తన కెరీర్‌లో వరుసగా ఆరు సినిమాలు ₹100Cr+ క్లబ్‌లో చేరినట్లు వెల్లడించారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవితో తీసిన <<18853731>>MSVPG<<>> అయితే 2రోజుల్లోనే ఈ ఫీట్ సాధించిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సంక్రాంతిని మరింత స్పెషల్‌గా మార్చారంటూ ప్రేక్షకులకు థాంక్స్ చెప్పారు.