News February 4, 2025
మేడ్చల్: ఘట్‌కేసర్‌లో విషాదం.. ఒకరి మృతి

ఘట్‌కేసర్ ద్వారకానగర్‌లో విషాదం నెలకొంది. చిన్న చెరువు వద్ద ఉరి వేసుకుని ఓ వ్యక్తి మృతి చెందారు. స్థానికుల వివరాలు.. శేఖర్ మద్యం మత్తులో భార్యతో గొడవ పడేవారు. దీంతో ఇరువురి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. ఈ నెల 1న తండ్రి, అన్నదమ్ములతోనూ అతడు గొడవ పెట్టుకున్నాడు. అదే రోజు చిన్న చెరువు వద్ద ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు స్పాట్‌కు చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
Similar News
News February 17, 2026
ఏపీలో అరాచక పాలన: గుడివాడ అమర్నాథ్

ఏపీలో అరాచక పాలన జరుగుతుందని జిల్లా వైసీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. మంగళవారం రాజమండ్రి కేంద్ర కారాగారంలో అంబటి రాంబాబును పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం ఆయన బయట మాట్లాడారు. అంబటి రాంబాబును అక్రమంగా అరెస్టు చేశారన్నారు. వైసీపీపై కూటమి నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కరణం ధర్మశ్రీ పాల్గొన్నారు.
News February 17, 2026
భారత్-ఫ్రాన్స్ బంధం గ్లోబల్ స్టెబిలిటీకి ఒక డైరెక్షన్: మోదీ

కర్ణాటకలోని వేమగల్‌లో ఏర్పాటు చేసిన టాటా-ఎయిర్‌బస్ H125 హెలికాప్టర్ అసెంబ్లీ ప్లాంట్‌ను మోదీ, మాక్రాన్ ప్రారంభించారు. 2026ను భారత్-ఫ్రాన్స్ ఇన్నోవేషన్ ఇయర్‌గా ప్రకటించారు. ఇరు దేశాల మధ్య స్టార్టప్‌లు, AI, రక్షణ రంగాల్లో సహకారాన్ని పెంచుతామన్నారు. ఫ్రాన్స్‌లో వివేకానంద కల్చరల్ సెంటర్ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. భారత్-ఫ్రాన్స్ బంధం గ్లోబల్ స్టెబిలిటీకి ఒక డైరెక్షన్ అని మోదీ పేర్కొన్నారు.
News February 17, 2026
ప్రతి విద్యార్థి చదువుపై దృష్టి పెట్టాలి: అదనపు కలెక్టర్

ఖమ్మం జిల్లాలోని ప్రతి విద్యార్థి నాణ్యమైన విద్యను అభ్యసించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని అ కలెక్టర్ శ్రీజ సూచించారు. మంగళవారం 7మండలాల ఎంఈఓలు, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులతో జిల్లా విద్యాశాఖాధికారి చైతన్య జైని అధ్యక్షతన సమీక్ష నిర్వహించారు. ‘ఎవ్రీ చైల్డ్ రైట్స్’, ఎఫ్‌ఎల్‌ఎన్ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేలా బోధనా ఉండాలన్నారు.


