News February 11, 2025

మేడ్చల్ జిల్లా వాసులకు రేషన్‌ కార్డులు (UPDATE)

image

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 33,435 మంది రేషన్ కార్డులు కావాలని దరఖాస్తులు చేసుకున్నారు. సోమవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా యంత్రాంగం ప్రత్యేక వివరాలను విడుదల చేసింది. ప్రభుత్వానికి ఈ వివరాలను పంపామని స్పష్టం చేసింది. త్వరలోనే ప్రభుత్వం నుంచి నిర్ణయం రాగానే అందరికీ కార్డులు అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది.

Similar News

News February 17, 2026

రాష్ట్రంలో వాలంటీర్ల నియామకం.. ఫొటోకు రూ.7-10

image

TG: పంటల నమోదు సర్వే కోసం ప్రతి గ్రామానికి ఒక వాలంటీర్ చొప్పున 10,909 మందిని నియమించాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. టెన్త్ నుంచి డిగ్రీ వరకు చదివి గ్రామ భూములపై అవగాహన ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది. ఒక్కో ఫొటోకు రూ.7 నుంచి రూ.10 వరకు చెల్లిస్తారు. 45 రోజుల యాసంగి సీజన్‌లో 2000 ఫోటోల వరకు అప్‌లోడ్ చేయవచ్చు. విద్యార్హత పత్రాలతో మండల వ్యవసాయ అధికారుల దగ్గర దరఖాస్తు చేసుకోవాలి.

News February 17, 2026

ఫ్యామిలీతో ఇండియాకు రండి.. తారిఖ్‌కు మోదీ ఆహ్వానం

image

బంగ్లాదేశ్ PM తారిఖ్ రెహ్మాన్‌కు భారత ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. పదవీకాలంలో విజయం సాధించాలని ఆకాంక్షించారు. భార్య జుబైదా, కుమార్తె జైమాతో కలిసి INDలో పర్యటించాలని ఆహ్వానించారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. కనెక్టివిటీ, ట్రేడ్, టెక్నాలజీ, ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్‌మెంట్, ఎనర్జీ, హెల్త్ కేర్ రంగాల్లో కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు.

News February 17, 2026

భూపాలపల్లి: ఫిబ్రవరి 21 నుంచి పత్తి కొనుగోళ్లు నిలిపివేత

image

భారత పత్తి సంస్థ మద్దతు ధర పత్తి కొనుగోళ్లు 21.02.2026 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిలిపివేయనున్నట్లు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ తెలిపింది. భూపాలపల్లి జిల్లాలో ఇప్పటికీ పత్తి అమ్మని రైతులు 20.02.2026 లోగా సమీప కొనుగోలు కేంద్రంలో కాపాస్ కిసాన్ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకుని విక్రయించాలని జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ రెడ్డి సూచించారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.