News October 7, 2025

మేడ్చల్: ‘మనకెప్పుడో ఎన్నికలు?’

image

రాష్ట్రంలోని 31 జిల్లాల్లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. అటు జూబ్లీహిల్స్ బైఎలక్షన్‌తో HYD రాజకీయాలు వేడెక్కాయి. మేడ్చల్ మినహా రాష్ట్రమంతా ఎన్నికల జోరు చెలరేగింది. గ్రామాల విలీనంతో మేడ్చల్ అర్బన్ జిల్లాగా రూపుదిద్దుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికీ ప్రత్యేక అధికారుల చేతుల్లోనే పరిపాలన సాగుతోంది. ‘మనకెప్పుడో ఎన్నికలు?’ అని మేడ్చల్ జిల్లా జనాలు చర్చించుకుంటున్నారు.

Similar News

News January 23, 2026

ACB కోర్టులో చెవిరెడ్డికి ఊరట

image

చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టులో ఊరట లభించింది. అనారోగ్య కారణాలతో బాధపడుతున్న ఆయన.. మంతెన సత్యనారాయణ ఆశ్రమంలో చికిత్స పొందేందుకు కోర్టు 15 రోజులు పర్మిషన్ ఇచ్చింది. రోజూ ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకే చికిత్సకు అవకాశం ఉంటుంది. అనంతరం నిబంధనలు పాటించాలని కోర్టు స్పష్టం చేసింది.

News January 23, 2026

గోదావరి పుష్కరాలకు 10 కోట్ల మంది!

image

AP: 2027 జూన్ 26 నుంచి ప్రారంభమయ్యే గోదావరి పుష్కరాలకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని CM CBN అధికారులను ఆదేశించారు. 3వ సారి ఈ పుష్కరాలు నిర్వహిస్తుండడం తన అదృష్టమని వ్యాఖ్యానించారు. ‘పోలవరం’ పనులు ఈలోగా పూర్తిచేయాలన్నారు. పోలవరం, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో పుష్కరాలకు ఏర్పాట్లు చేయాలన్నారు. పుష్కరాలకు 10కోట్ల మంది వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు.

News January 23, 2026

కోటపాడులో పరిశ్రమ విస్తరణకు భూముల పరిశీలన

image

కోటపాడులో రామ్‌కో సిమెంట్‌ పరిశ్రమ విస్తరణకు ప్రతిపాదించిన భూములను జిల్లా జాయింట్‌ కలెక్టర్ కార్తీక్ శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. పరిశ్రమ విస్తరణ కోసం దరఖాస్తు చేసుకున్న 79 ఎకరాల భూమిని బనగానపల్లె ఇన్‌ఛార్జి ఆర్డీఓ నరసింహులు, తహశీల్దార్ విశ్వసాయితేజతో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. భూములకు సంబంధించిన రికార్డులు, ఇతర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.