News February 15, 2025

మేడ్చల్: మాడ మాడిపోయేలా ఎండ.. HOT SPOTS..!

image

మేడ్చల్ జిల్లాలో ప్రారంభంలోనే మాడ మాడిపోయేలా ఎండ దంచి కొడుతుంది. ఎండ తీవ్రత అధికంగా ఉన్న హాట్ స్పాట్ ప్రాంతాలను అధికారులు వెల్లడించారు. బాచుపల్లి, దుండిగల్, కుత్బుల్లాపూర్, గండి మైసమ్మ, కూకట్‌పల్లి, అల్వాల్, మల్కాజిగిరి, కీసర, ఘట్కేసర్, మేడిపల్లి, ఉప్పల్ ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, బయటకు వెళ్లినప్పుడు అత్యధికంగా పానీయాలు తాగడం మంచిదని నిపుణులు సూచించారు.

Similar News

News March 16, 2026

నంద్యాలలో పొట్టి శ్రీరాములు జయంతి

image

నంద్యాల సంజీవ్ నగర్ సర్కిల్‌లో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పొట్టి శ్రీరాములు మహాత్మా గాంధీ ఆశయాలతో పనిచేసిన గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడని కలెక్టర్ కొనియాడారు. కులమత భేదాలు లేని సమానత్వ సమాజం కోసం ఆయన ఎంతో కృషి చేశారని ఆమె గుర్తుచేశారు.

News March 16, 2026

ADB: భట్టి పద్దు.. జిల్లా ప్రాజెక్టులకు నిధులు దక్కేనా..?

image

బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఉమ్మడి ADB జిల్లా ప్రాజెక్టులకు నిధుల కేటాయింపుపై ఆసక్తి నెలకొంది. ప్రాణహిత-చేవెళ్ల పనులకు భట్టి పద్దులో ప్రాధాన్యం దక్కుతుందని ప్రజలు ఆశిస్తున్నారు. కొమురం భీమ్ ప్రాజెక్టు, పెద్దవాగు పూర్తికి నిధులు అవసరమున్నాయి. చనాక-కోరాట, పింపల్‌కాడ్, కుఫ్టీ ప్రాజెక్టులకు పూర్తిస్థాయిలో నిధులు కేటాయిస్తేనే సాగునీటి కల సాకారమవుతుంది. బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని వారు కోరుతున్నారు.

News March 16, 2026

హనుమకొండలో జిల్లా స్థాయి చెస్ పోటీలు

image

ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి చదరంగం పోటీలకు హనుమకొండ వేదిక కానుంది. తెలంగాణ రాష్ట్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 22న హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో ఈ పోటీలు నిర్వహించనున్నారు. అండర్-7 నుంచి అండర్-15 విభాగాల్లో బాలబాలికలకు విడివిడిగా పోటీలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. జిల్లాలోని ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించేందుకు ఈ పోటీలు దోహదపడతాయని పేర్కొన్నారు.