News August 11, 2025

మేడ్చల్: ‘సివిల్స్ ఇంట్రెస్ట్ ఉందా! అందుబాటులో ఉంటా’

image

సివిల్స్ చేయాలనే ఆసక్తి ఉన్న విద్యార్థులకు అవసరమైన మార్గనిర్దేశాన్ని, మెటిరియల్‌ను అందించడమే కాకుండా, ఎప్పుడైనా అందుబాటులో ఉంటానని మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి భరోసా ఇచ్చారు. సోమవారం కీసర మండలం అంకిరెడ్డిపల్లిలో ఉప్పల్, కుత్బుల్లాపూర్‌లకు నిర్వహిస్తున్న మహాత్మ జ్యోతిబాఫులే తెలంగాణ బీసీ వెల్పేర్ రెసిడెన్షియల్ కాలేజీని తనిఖీల్లో భాగంగా మాట్లాడారు.

Similar News

News March 15, 2026

గద్వాల: గ్యాస్ సిలిండర్ల దుర్వినియోగంపై కలెక్టర్ హెచ్చరిక

image

డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను కమర్షియల్ అవసరాలకు వాడితే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ హెచ్చరించారు. గ్యాస్ పక్కదారి పట్టకుండా 11 మంది అధికారులతో ‘డిస్ట్రిక్ట్ ఎనర్జీ మానిటరింగ్ కమిటీ’ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలోని 11 గ్యాస్ ఏజెన్సీలపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని స్పష్టం చేశారు.

News March 15, 2026

తిరుపతి: మీకూ మెసేజ్‌లు వస్తున్నాయా..

image

విద్యుత్ బిల్లుల పేరుతో వినియోగదారులకు పంపుతున్న నకిలీ సందేశాలను నమ్మవద్దని ఏపీఎస్పీడీసీఎల్ CMD శివశంకర్ లోతేటి కోరారు. మీ బిల్లు బకాయి ఉందని, వెంటనే చెల్లించకపోతే విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామని హెచ్చరిస్తూ, మరిన్ని వివరాల కోసం OTP చెప్పమని, ఈ క్లిక్ నొక్కాలని తదితర మోసపూరిత సందేశాలను నమ్మవద్దని సూచించారు. వినియోగదారులు సమస్యలపై టోల్ ఫ్రీ నంబర్ 1912ను సంప్రదించాలని కోరారు.

News March 15, 2026

నరసరావుపేటలో చికెన్ ధరల సెగ.. కేజీ ఎంతంటే!

image

నరసరావుపేటలో చికెన్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు తగ్గడంతో ఒక్కసారిగా రేట్లు పెరిగాయి. లైవ్ కోడి కిలో రూ. 175 ఉండగా, స్కిన్ లెస్ ధర రూ. 345కు చేరింది. మటన్ కిలో రూ. 1000 వరకు పలుకుతోంది. ధరలు భారీగా పెరగడంతో సామాన్యులు మాంసం కొనాలంటేనే జంకుతున్నారు. సరఫరా మెరుగుపడితేనే ధరలు తగ్గుతాయని వ్యాపారులు చెబుతున్నారు. మరి మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.