News May 7, 2025

మేదరమెట్ల: అదుపుతప్పి కంటైనర్ లారీని ఢీకొన్న ఐచర్ వాహనం

image

మేదరమెట్ల జాతీయ రహదారిపై వెంకటాపురం క్రాస్ రోడ్డు వద్ద శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. ఒంగోలు నుంచి గుంటూరు వెళుతున్న ఐచర్ లారీకి ఒక్కసారిగా ముందు టైరు పగిలిపోయింది. దీంతో అదుపుతప్పి డివైడర్‌ని ఢీకొని, ఆ పక్క రహదారిలో ఆగి ఉన్న కంటైనర్ వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఐచర్ డ్రైవర్‌కు గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

Similar News

News February 17, 2026

కేయూ పీజీ పరీక్షల షెడ్యూల్ విడుదల

image

కాకతీయ విశ్వవిద్యాలయం పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షల కాలపట్టికను వర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య రాజేందర్ కట్ల విడుదల చేశారు. ఈ నెల 25 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు. ఈ నెల 25న మొదటి పేపర్, 27న రెండో పేపర్, మార్చి 2, 5, 7, 9 తేదీల్లో మిగిలిన పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ప్రతిరోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షా సమయం ఉంటుందని పేర్కొన్నారు.

News February 17, 2026

కాంగ్రెస్‌కు సత్తా లేదు.. బీజేపీతో కుమ్మక్కు: హరీశ్ రావు

image

కాంగ్రెస్ పార్టీకి ఒంటరిగా BRSను ఎదుర్కొనే సత్తా లేదని, అందుకే సిగ్గు వదిలేసి బీజేపీతో కుమ్మక్కు అయిందని ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్, బీజేపీ మధ్య ఉన్న ఫెవికాల్ బంధం ఈరోజు మున్సిపల్ ఫలితాలతో మరోసారి స్పష్టమైందని ధ్వజమెత్తారు. రెండు జాతీయ పార్టీలు ఒకటై బీఆర్ఎస్ మీద దాడి చేస్తున్నాయని, ఆ పార్టీల చీకటి ఒప్పందాలను ప్రజలు గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

News February 17, 2026

సిద్దిపేట: మహిళలకే అందలం.. కొత్త ఛైర్‌పర్సన్‌లు వీరే

image

సిద్దిపేట జిల్లాలోని చేర్యాల, దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్ మున్సిపాల్ ఛైర్‌పర్సన్ పదవులు మహిళలకు రిజర్వు అయ్యాయి. దీంతో కీలకమైన ఆ పదవిలో నలుగురు మహిళా మణులు బాధ్యతలు స్వీకరించారు. చేర్యాల మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా ముస్త్యాల అరుణ, దుబ్బాక- శ్రీరామ్ సంగీత, గజ్వేల్-గంగిశెట్టి చందన, హుస్నాబాద్- దండి లక్ష్మిలు పదవి చేపట్టారు.