News August 14, 2025
మేదరమెట్ల: బస్సు ఢీకొని వ్యక్తి మృతి

కొరిశపాడు మండలం మేదరమెట్లలో సెయింట్ ఆర్నాల్డ్ పాఠశాల వద్ద బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైకును బస్సు ఢీకొనడంతో ద్విచక్రవాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. మృతుడు వెంపరాలకు చెందిన షేక్ జిలాని బాషాగా గుర్తించారు.
Similar News
News March 10, 2026
మీ గ్యాస్ సిలిండర్ బుక్ అవుతోందా?

గల్ఫ్ యుద్ధంతో మన దగ్గర గ్యాస్ సప్లైలో కొరత ఏర్పడింది. డొమెస్టిక్ సిలిండర్లు ఆన్‌లైన్‌లో బుక్ అవ్వడం లేదని కొందరు వాపోతున్నారు. 10 రోజుల కింద బుక్ చేసినా డెలివరీ చేయడం లేదని మరికొందరు ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే కొన్ని ఏజెన్సీలు కావాలనే కృత్రిమ కొరత సృష్టిస్తున్నాయనే ఆరోపణలూ ఉన్నాయి. బుకింగ్ సమస్య మీకూ ఎదురవుతోందా? అయితే సంబంధిత సంస్థలకు మెయిల్, ఫోన్ ద్వారా కంప్లైంట్ చేయండి.
News March 10, 2026
కొయ్యలగూడెం: ఈ నెల 25 నుంచి పొగాకు కొనుగోళ్లు

ఎన్ఎల్ఎస్ పరిధిలో వర్జీనియా పొగాకు వేలం కొనుగోళ్లు ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్నట్లు వేలం నిర్వహణ అధికారి శివకుమార్ తెలిపారు. కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం1,2, దేవరపల్లి, గోపాలపురంలోని ఐదు కేంద్రాల్లో వేలం జరుగుతుందన్నారు. సుమారు 4,816 హెక్టార్లలో పొగాకు సాగు చేస్తున్న 2,673 మంది రిజిస్టర్డ్ రైతులు తమ ఉత్పత్తులను విక్రయించుకోవచ్చని, ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన వివరించారు.
News March 10, 2026
గల్ఫ్ యుద్ధం.. నిజామాబాద్ వాసికి గాయాలు

గల్ఫ్ యుద్ధం కారణంగా నిజామాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తి గాయపడ్డారు. కమ్మర్‌పల్లికి చెందిన తిరుపతి ఉపాధి నిమిత్తం ఏడేళ్ల క్రితం ఇజ్రాయెల్ వెళ్లారు. ఇటీవల ఆయన విధుల్లో ఉండగా మిస్సైల్ దాడిలో శకలాలు ఎగిరిపడి తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆయనను స్థానిక ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం కోలుకుంటున్నారు. తిరుపతిని క్షేమంగా స్వదేశానికి రప్పించాలని కుటుంబీకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.


