News April 26, 2024
మే 1వ తేదీన ఏలూరులో జగన్ పర్యటన

వైసీపీ అధినేత YS జగన్ మోహన్ రెడ్డి మే 1వ తేదీన ఏలూరులో నిర్వహించనున్న ఎన్నికల బహిరంగ సభలో పాల్గొంటారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు పర్యటన వివరాలను గురువారం విడుదల చేశారు. 1వ తేదీన (బుధవారం) మధ్యాహ్నం 3 గంటలకు సభలో పాల్గొంటారని పేర్కొన్నారు.
Similar News
News April 19, 2026
ప.గో: హాట్ టాపిక్.. అసలు సూత్రధారులు ఎవరు?

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరుతో నకిలీ సిఫార్సు లేఖలు తయారుచేసి ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేసిన వ్యవహారం జిల్లాలో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జనసేన శ్రేణులు పోలీసులకు ఫిర్యాదు చేయగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు సైతం ఫిర్యాదు చేయడం కొసమెరుపు. ఇప్పటికే ఈ వ్యవహారం జనసేన పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్లినట్లు సమాచారం.
News April 19, 2026
ప.గో: పూర్తి ఆధారాలతో హాజరు కావాలి.. కలెక్టర్

జిల్లాలో 22-ఏ భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు రైతులు పూర్తి ఆధారాలతో విచారణకు హాజరుకావాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన రెవెన్యూ విచారణలో ఆమె మాట్లాడారు. భూ వివాదాల పరిష్కారంలో పారదర్శకత పాటించాలని అధికారులను ఆదేశించారు. దరఖాస్తులను వేగంగా పరిశీలించి రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని తహశీల్దార్లకు స్పష్టం చేశారు.