News October 8, 2024

మైదుకూరు: కాలువలో పడి బాలుడి మృతి

image

మైదుకూరు మండలం విశ్వనాథపురంలో కొట్టం సుజిత్ (14) అనే బాలుడు కాలవలో పడి మృతి చెందిన ఘటన మంగళవారం జరిగింది. ఎస్సీ కాలనీకి చెందిన సుజిత్ గ్రామ సమీపంలోని తెలుగుగంగ కాలువలో ప్రమాదవశాత్తూ పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మైదుకూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలుడి మృతితో కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Similar News

News November 6, 2024

నేడు కడప జిల్లా కలెక్టర్ బాధ్యతల స్వీకరణ

image

కడప జిల్లా నూతన కలెక్టర్‌గా శ్రీధర్ నేడు బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇక్కడ పనిచేస్తున్న పూర్వపు కలెక్టర్ శివ శంకర్‌ను తెలంగాణ క్యాడర్‌కు బదిలీ చేయడంతో, ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌గా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ ఉన్నారు. జిల్లాకు కొత్త కలెక్టర్‌గా శ్రీధర్‌ను ఇటీవల ప్రభుత్వం నియమించింది. దీంతో ఆయన నేడు కలెక్టరేట్‌లో బాధ్యతలు స్వీకరిస్తారని అధికారులు తెలిపారు.

News November 5, 2024

9న కడప జిల్లాకు CM చంద్రబాబు

image

ఈనెల 9వ తేదీన కడప జిల్లాకు ముఖ్యమంత్రి చంద్రబాబు రానున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదలైంది. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం గండికోటకు రానున్నట్లు ఇన్‌ఛార్జ్ కలెక్టర్ అదితి సింగ్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు గెలిచాక మొదటిసారి జిల్లాకు రానుండగా ఏర్పాట్లను ముమ్మరం చేశారు.

News November 5, 2024

రాజకీయ వేడి పుట్టిస్తున్న రాచమల్లు ప్రెస్‌‌మీట్లు

image

మాజీ MLA రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మంగళవారం 11 గంటలకు ప్రెస్ మీట్ పెట్టనున్నారు. ఇటీవల ఆయన వరుస ప్రెస్‌మీట్లతో అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాకుండా జగన్ ఆస్తులకు సంబంధించి వైఎస్ షర్మిల, విజయమ్మలపై కూడా ప్రశ్నలు సంధించారు. ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఆయన స్పందించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల రాచమల్లు చేస్తున్న వ్యాఖ్యలపై మీ కామెంట్.