News September 12, 2025

మైలవరంలో కన్న తండ్రి ఘాతుకం

image

కన్న కూతురు లవ్ మ్యారేజ్ చేసుకుందని, గంజాయి కేసులో పట్టించిందని కక్ష పెంచుకున్న తండ్రి కూతురు గాయత్రిని ఇనుప రాడ్డుతో కొట్టి చంపాడు. ఈ దారుణ ఘటన మైలవరంలో జరిగింది. జైలు నుంచి విడుదలైన బాజీ, గతేడాది ఆగస్టు 31న తన కూతురిని చంపి మృతదేహాన్ని ఖమ్మం జిల్లా మధిర వద్ద కాలువలో పడేసినట్లు విచారణలో ఒప్పుకున్నాడు. పోలీసులు డ్రోన్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.

Similar News

News December 14, 2025

MHBD: @11AM.. 59.72 శాతం పోలింగ్

image

జిల్లాలో రెండో విడత పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి. బయ్యారం 56.28 శాతం, చిన్నగూడూరు 64.83, దంతాలపల్లి 66.45, గార్ల 53.60, నర్సింహుల పేట 65.48, పెద్ద వంగర 62.00, తొర్రూర్‌లో 20.26 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 59.72 శాతం పోలింగ్ నమోదైనట్లు వివరించారు.

News December 14, 2025

జగిత్యాలలో 11 గంటల వరకు ఎంతమంది ఓటేశారంటే?

image

జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఉదయం 11 గంటల వరకు 51.77% పోలింగ్ నమోదైంది. మొత్తం 2,08,168 మంది ఓటర్లలో 1,07,769 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారరు. రాయికల్ మండలంలో 55.57%తో అత్యధిక పోలింగ్ నమోదైంది. జగిత్యాల రూరల్‌లో 54.72%, జగిత్యాలలో 54.90%, బీర్పూర్‌లో 54.22%, సారంగపూర్‌లో 52.26%, కొడిమ్యాలలో 50.04% పోలింగ్ జరిగింది. మల్యాల మండలంలో 44.48% పోలింగ్ నమోదైంది.

News December 14, 2025

భూపాలపల్లి 62.48% పోలింగ్ @11AM

image

భూపాలపల్లి జిల్లాలో రెండో విడతలో పంచాయతీలకు జరుగుతున్న ఎన్నికల్లో ఉదయం 11 గంటల వరకు 62.48 శాతం పోలింగ్ నమోదైనట్లు జిల్లా పంచాయతీ అధికారి శ్రీలత తెలిపారు. మండలాల వారీగా భూపాలపల్లి 63.59, చిట్యాల 61.32, పలిమెల 76,70 , టేకుమట్ల 59.38 పోలింగ్ శాతం నమోదయింది. జిల్లాలో ఎన్నికలు జరుగుతున్న గ్రామాలలో 82,278 మంది ఓటర్లు ఉన్నారు.