News December 15, 2025
మొక్కజొన్నను ఆశించే తెగుళ్లు – నివారణ

మొక్కజొన్న నాటిన 30 రోజుల దశలో పేనుబంక ఆశిస్తుంది. దీని వల్ల ఆకులు పసుపు రంగులోకి మారి ముడుచుకుపోతాయి. దీని నివారణకు లీటరు నీటికి డైమిథోయేట్ 2ml, ఎసిఫేట్ 1.5 గ్రాములను కలిపి పిచికారీ చేయాలి. నల్లులు ఆశించకుండా పొలంలో కలుపు లేకుండా చూసుకోవాలి. ఒకవేళ నల్లులు ఆశిస్తే లీటరు నీటిలో డైకోఫాల్ 50mlను కలిపి పిచికారీ చేయాలి. తెల్లదోమ నివారణకు 1ml వేప నూనెను 5 గ్రాముల సబ్బుపొడిలో కలిపి పిచికారీ చేయాలి.
Similar News
News January 19, 2026
ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్

సిద్దిపేట జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ కె. హైమావతి, అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్‌తో కలిసి ప్రజల నుండి వినతులు స్వీకరించారు. బాధితులతో స్వయంగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజావాణి ద్వారా వచ్చే దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టకుండా, తక్షణమే పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయాలని ఆమె జిల్లా అధికారులను ఆదేశించారు.
News January 19, 2026
వందే భారత్ స్లీపర్ టికెట్లకు కొత్త నిబంధనలు

వందే భారత్ స్లీపర్ రైలు పట్టాలెక్కిన వేళ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ట్రైన్‌లో టికెట్ క్యాన్సిలేషన్ రూల్స్‌ను మరింత కఠినతరం చేసింది. 72 గంటలకు ముందు టికెట్ రద్దు చేస్తే 25%, 72 నుంచి 8 గంటల మధ్య క్యాన్సిల్ చేస్తే 50% ఛార్జ్ కట్ అవుతుంది. 8 గంటలలోపు రద్దు చేస్తే ఒక్క రూపాయి కూడా రిఫండ్ ఉండదు. వందేభారత్ స్లీపర్‌లో RAC, వెయిటింగ్ లిస్ట్ ఉండవని ఇప్పటికే రైల్వే శాఖ స్పష్టం చేసింది.
News January 19, 2026
WPL: RCBతో మ్యాచ్.. టాస్ గెలిచిన గుజరాత్

ఉమెన్స్ ప్రీమియర్స్ లీగ్‌లో ఇవాళ గుజరాత్, బెంగళూరు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన గుజరాత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటివరకు ఈ సీజన్‌లో ఓటమే(4 మ్యాచులు) ఎరుగని RCB ఈ మ్యాచులోనూ గెలిచి విజయపరంపర కొనసాగించాలని చూస్తోంది. అటు తొలి రెండింట్లో ఓడి తర్వాతి 2 మ్యాచుల్లో నెగ్గిన గుజరాత్ RCBకి తొలి ఓటమి రుచి చూపించాలని ఉవ్విళ్లూరుతోంది. మరి ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.


