News May 7, 2025
మొగల్తూరు: యువకుడిని కాపాడిన పోలీసులు

పేరుపాలెం తీరానికి వచ్చి సేద తీరుతూ అలల ఉదృతికి లోపలికి కొట్టుకుపోతున్న ఒక యువకుడుని తీరం వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులు రక్షించారు. శుక్రవారం ద్వారకాతిరుమలకు చెందిన వీరవల్లి మధు అనే యువకుడు పేరుపాలెం సాగర తీరానికి వచ్చాడు. మద్యాహ్నం సమయంలో సముద్ర స్నానం చేస్తూ అలల ఉదృతికి గురై కొట్టుకుపోతున్నాడు. పోలీస్ కానిస్టేబుల్ పి.శ్రీనివాస్, హెచ్‌సీ హరి యువకుడిని కాపాడి ఒడ్డుకు తీసుకువచ్చారు.
Similar News
News February 11, 2026
భీమవరంలో డయాలసిస్ కష్టాలు.. జిల్లా కేంద్రంలోనే లేని వైద్య సేవలు!

జిల్లా కేంద్రం భీమవరంలో డయాలసిస్ కేంద్రం లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఉన్న సెంటర్‌ను తొలగించడంతో చికిత్స కోసం పాలకొల్లు, ఆకివీడు వెళ్లాల్సి వస్తోంది. దూర ప్రయాణం భారమై ప్రాణాపాయ స్థితిని ఎదుర్కొంటున్నామని, వెంటనే పట్టణంలో తాత్కాలిక డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి తమను ఆదుకోవాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
News February 11, 2026
నరసాపురం: తీరంలో అలివ్ రిడ్లే తాబేళ్ల మృత్యువాత

నరసాపురం, మొగల్తూరు సముద్ర తీర ప్రాంతాల్లో అరుదైన అలివ్ రిడ్లే తాబేళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఏటా డిసెంబర్ నుంచి మార్చి నెలల మధ్య సంతానోత్పత్తి కోసం వేల కిలోమీటర్ల దూరం నుంచి తీరానికి వచ్చే ఈ తాబేళ్లు.. ఈ ఏడాది వరుసగా ప్రాణాలు కోల్పోవడం పట్ల పర్యావరణ ప్రేమికులు, మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాబేళ్లు మృతి చెంది ఒడ్డుకు కొట్టుకురావడంతో తీరం వెంబడి దుర్వాసన వెదజల్లుతోంది.
News February 10, 2026
ప.గో: ఫైళ్ల నిర్వహణ ఇక ఈ-ఆఫీస్ ద్వారానే

ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకత కోసం ఇకపై ప్రతి ఫైలు ఈ-ఆఫీస్ ద్వారానే పంపాలని జేసీ రాహుల్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి రెవెన్యూ అధికారులకు నిర్వహించిన గూగుల్ మీట్ అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. జేసీ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ విధిగా ఆన్‌లైన్ విధానంలోనే జరగాలని, ఉద్యోగులందరూ ఈ సాంకేతికతపై పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.


