News August 20, 2025

మొదటి ప్రమాద హెచ్చరిక చేరువలో గోదావరి

image

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఈ రోజు తెల్లవారుజామున 6 గంటలకు 42.2 అడుగుల వద్ద ప్రవహిస్తోంది. దీంతో వరద నీరు కళ్యాణకట్ట వరకు చేరింది. నీటిమట్టం 43 అడుగులు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. నీటిమట్టం ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. నది వద్ద అధికారులు గజ ఈతగాళ్లు, లాంచీలు ఏర్పాటు చేశారు.

Similar News

News January 17, 2026

కాకినాడలో పవన్ ‘న్యూ లుక్’

image

జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సరికొత్త వేషధారణతో అభిమానులను మంత్రముగ్ధులను చేశారు. ఈనెల 9న పిఠాపురం, కాకినాడ పర్యటనలో ప్యాంటు, స్వెటర్ ధరించి సాదాసీదాగా కనిపించిన ఆయన, శనివారం గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమానికి మాత్రం పూర్తి ‘స్మార్ట్’ లుక్‌లో విచ్చేశారు. గడ్డం ట్రిమ్ చేసుకొని, సంప్రదాయ కుర్తా పైజామాలో మెరిసిపోతున్న పవన్‌ను చూసి అభిమానులు జేజేలు పలికారు.

News January 17, 2026

విధుల్లో చేరిన మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు

image

మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పులి శ్రీనివాసులు శనివారం ఉదయం విధుల్లో చేరారు. ఇవాళ తన కార్యాలయంలో బాధ్యతలను చేపట్టారు. అద్దంకి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి, గ్రూప్-2 పరీక్షలో ఉత్తీర్ణులై 2009లో అద్దంకి ఎమ్మార్వోగా పనిచేసిన పులి శ్రీనివాసరావు పని చేశారు. ఇటీవల నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లాకు జాయింట్ కలెక్టర్‌గా నియమితులయ్యారు.

News January 17, 2026

తిరుపతి: ఈ రెండు పరీక్షలు తప్పక రాయాల్సిందే..!

image

ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదివే విద్యార్థులు 2 పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఈనెల 21న నైతికత, మానవీయ విలువలు, 23న పర్యావరణ పరిరక్షణ పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షలకు ఉత్తీర్ణత కాకపోతే.. పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణులు అయినా కూడా మార్కులు కనిపించవని అధికారులు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 30,318 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయాల్సి ఉంది. ఈ పరీక్షలకు తప్పనిసరిగా హాజరయ్యేలా తల్లిదండ్రులు చొరవచూపాలి.