News November 19, 2025
మోతే: భార్యను హత్య చేసిన భర్త అరెస్టు

భార్య పద్మను రోకలిబండతో బాది హత్య చేసిన భర్త కారింగుల వెంకన్నను మోతే పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. సీఐ రామకృష్ణారెడ్డి తెలిపిన వివరాలు.. సిరికొండకు చెందిన వెంకన్న, భార్య పద్మపై అనుమానంతో తరుచూ గొడవ పడేవాడు. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి ఆవేశంలో పద్మను చంపాడు. నిందితుడిని పట్టుకుని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.
Similar News
News January 20, 2026
APలో RMZ సంస్థ రూ.లక్ష కోట్ల పెట్టుబడులు!

AP: రాష్ట్రంలో భారీగా పెట్టుబడులకు RMZ సంస్థ ముందుకొచ్చింది. రూ.లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు సంస్థ ఛైర్మన్ మనోజ్ మెండా తెలిపారు. దావోస్ సమ్మిట్‌లో మంత్రి లోకేశ్‌తో సమావేశం అనంతరం ఈ ప్రకటన చేశారు. విశాఖ కాపులుప్పాడ ఫేజ్-1 ఐటీ పార్క్‌లో 50 ఎకరాల్లో జీసీసీ పార్క్ అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. 1Gw వరకు హైపర్‌స్కేల్ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు ప్లాన్‌లు రెడీ చేస్తున్నామని పేర్కొన్నారు.
News January 20, 2026
బాపట్ల కలెక్టర్ కీలక ఆదేశాలు

సురక్షిత తాగునీరు అందించడం అధికారుల బాధ్యతని కలెక్టర్ డా.వి.వినోద్ కుమార్ అన్నారు. మంగళవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. జలజీవన్ మిషన్ కింద జిల్లాలోని 2.95 లక్షల గ్రామీణ గృహాలకు గాను, ఇప్పటివరకు 1.26 లక్షల కనెక్షన్లు పూర్తి చేసినట్లు తెలిపారు. మిగిలిన 1.69 లక్షల గృహాలకు యుద్ధప్రాతిపదికన కుళాయి కనెక్షన్లు ఇవ్వాలని, నీటి నాణ్యతలో రాజీ పడకూడదని అధికారులను ఆదేశించారు.
News January 20, 2026
వరంగల్: ‘ఈనెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలి’

వరంగల్ జిల్లాలోని దివ్యాంగులకు వివిధ సహాయ ఉపకరణాల మంజూరుకు అర్హత కలిగిన వారు ఈనెల 30వ తేదీలోగా https://tgobmms.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమ శాఖ అధికారిణి బి.రాజమణి తెలిపారు. అర్హత గల వారికి బ్యాటరీ వీల్ ఛైర్లు, మొబైల్ బిజినెస్ బ్యాటరీ ట్రై సైకిల్స్, హైబ్రిడ్ వీల్ చైర్లు, ల్యాప్‌టాప్‌లు (డిగ్రీ విద్యార్థులకు), ట్యాబులు మంజూరు చేసి అందిస్తామన్నారు.


