News November 19, 2025
మోతే: భార్యను హత్య చేసిన భర్త అరెస్టు

భార్య పద్మను రోకలిబండతో బాది హత్య చేసిన భర్త కారింగుల వెంకన్నను మోతే పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. సీఐ రామకృష్ణారెడ్డి తెలిపిన వివరాలు.. సిరికొండకు చెందిన వెంకన్న, భార్య పద్మపై అనుమానంతో తరుచూ గొడవ పడేవాడు. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి ఆవేశంలో పద్మను చంపాడు. నిందితుడిని పట్టుకుని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.
Similar News
News January 16, 2026
చిత్తూరులో జనాభా లెక్కలు ఎప్పటి నుంచో తెలుసా?

చిత్తూరు జిల్లాలో జన గణననకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేపడుతున్నారు. కలెక్టర్ ఇటీవల సమావేశం ఏర్పాటు చేసి తాను ముఖ్య జన గణన అధికారిగా ఉంటానని వెల్లడించారు. ఇతర శాఖ అధికారులకు బాధ్యతలు అప్పగించారు. జిల్లాలో సుమారు ఆరు లక్షల గృహాలు ఉండగా.. 2011 లెక్కల ప్రకారం18 లక్షల మంది జనాభా ఉన్నారు. ప్రత్యేక యాప్ ద్వారా ఏప్రిల్ ఒకటి నుంచి జన గణన చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
News January 16, 2026
ADB: 18న కొమురం భీమ్ స్టడీ సర్కిల్ ప్రవేశ పరీక్ష

కొమురం భీమ్ స్టడీ సర్కిల్ HYD 2026-27 విద్యా సంవత్సరానికిగాను ఈనెల 18న ప్రవేశ పరీక్ష నిర్వహించనుంది. ASFలోని స్టడీ సర్కిల్, ఆదిలాబాద్ జిల్లా లింగపూర్‌లోని ఏకలవ్య టీఆర్‌సీ కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. మెయిల్ ద్వారా సమాచారం అందుకున్న అభ్యర్థులు మాత్రమే ప్యాడ్, పెన్నులతో హాజరుకావాలని సూచించారు. అభ్యర్థులకు పరీక్షా కేంద్రాల వద్ద భోజన సదుపాయం కల్పించనున్నట్లు పేర్కొన్నారు.
News January 16, 2026
ఎల్.ఎన్.పేట: పండగపూట విషాదం.. యువకుడు మృతి

ఎల్.ఎన్.పేట(M) మోదుగువలస నిర్వాసితుల కాలనీకి చెందిన సాయికుమార్(25) రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. భోగి రోజు సాయికుమార్ మరో యువకుడితో కలిసి ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తూ స్కాట్ పేట వద్ద నడిచి వెళుతున్న వ్యక్తిని ఢీకొని కిందపడ్డారు. సాయికుమార్ మృతితో గ్రామంలో విషాద చ్ఛాయలు అలముకున్నాయి. దీనిపై కేసు నమోదు చేసినట్లు సరుబుజ్జిలి ఎస్ఐ హైమావతి తెలిపారు.


