News November 19, 2025
మోతే: భార్యను హత్య చేసిన భర్త అరెస్టు

భార్య పద్మను రోకలిబండతో బాది హత్య చేసిన భర్త కారింగుల వెంకన్నను మోతే పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. సీఐ రామకృష్ణారెడ్డి తెలిపిన వివరాలు.. సిరికొండకు చెందిన వెంకన్న, భార్య పద్మపై అనుమానంతో తరుచూ గొడవ పడేవాడు. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి ఆవేశంలో పద్మను చంపాడు. నిందితుడిని పట్టుకుని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.
Similar News
News January 24, 2026
సిరిసిల్ల: బాలికలు అన్ని రంగాల్లో రాణించాలి

బాలికలు అన్ని రంగాల్లో రాణించాలని, ఉన్నత స్థానాలకు ఎదగాలని ఇంఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆకాంక్షించారు. జాతీయ బాలికల దినోత్సవాన్ని జిల్లా సంక్షేమ శాఖ ఆద్వర్యంలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శనివారం నిర్వహించారు. ఈ మేరకు ఇంఛార్జ్ కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. ఫ్లెక్సిపై బాలికలను ఉద్దేశించి స్కై ఇస్ ద లిమిట్ అని రాశారు.
News January 24, 2026
గద్వాల జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!

*గద్వాల: మున్సిపల్ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి
*రేపు పలు కాలనీలకు పవర్ కట్
*వేరుశనగకు రికార్డ్ ధర రూ.9,389
*అలంపూర్: సీఐగా ప్రదీప్ కుమార్
*శక్తిపీఠంలో భక్తుల సందడి
*అయిజ: బాల్యవివాహాలు భవిష్యత్తుకు అడ్డంకులు
*మానవపాడు: లైన్మెన్‌ను నియమించాలని వినతి
*ఎర్రవల్లి: అక్రమ చేపల చెరువులపై చర్యలు తీసుకోవాలి
*కేటిదొడ్డి: గణతంత్ర వేడుకలకు పాఠశాలలు ముస్తాబు
*ధరూర్: కనులపండువగా అంజన్న రథోత్సవం
News January 24, 2026
రామభద్రపురంలో యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

రామభద్రపురంలో శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. బొబ్బిలి మండలం కమ్మవలసకు చెందిన రాము రామభద్రపురం నుంచి బొబ్బిలి వైపు బైక్ పై వెళ్తుండగా.. రామభద్రపురం వైపు వస్తున్న బొలెరో చిన్నమ్మ తల్లి ఆలయం వద్ద ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాము తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు.


