News October 7, 2024
మోస్రా: చెరువులో దూకి వ్యక్తి ఆత్మహత్య
చెరువులో దూకి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా మోస్రా మండలానికి చెందిన సాయిలు(46) అప్పులు తీసుకున్నాడు. కాగా, అవి ఎలా తీర్చాలో అర్థం అవ్వక మానసింకంగా కుంగిపోయేవాడు. ఈ క్రమంలో మనస్తాపం చెంది చెరువులో దూకి సూసైడ్ చేసుకునట్లు తెలిపారు.తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
Similar News
News November 6, 2024
గవర్నర్‌ను కలిసిన షబ్బీర్ అలీ
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సీఎం రేవంత్ రెడ్డితో కలిసి రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ వర్మను బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయనకు పుష్పగుచ్ఛం అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన కుటుంబ సమగ్ర సర్వే వివరాలను ఆయనకు వివరించారు. కాగా ఈ కార్యక్రమం పట్లు ఆయన హర్షం వ్యక్తం చేశారు.
News November 6, 2024
బిక్కనూరు: చెరువులో పడి వ్యక్తి మృతి
చెరువులో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన బిక్కనూర్‌లో జరిగింది. పెద్దమల్లారెడ్డికి చెందిన కొట్టాల సిద్ధరాములు (66) ఈ నెల 4న చేపల వేటకు వెళ్లాడు. తిరిగి రాకపోవడంతో జాలరులు గాలింపు చేపట్టినా ప్రయోజనం లేకుండా పోయింది. కాగా బుధవారం చెరువులో మృత దేహం లభ్యమైనట్లు ఎస్ఐ సాయికుమార్ తెలిపారు. మృతుడి భార్య బాలమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
News November 6, 2024
నిజామాబాద్: నేటితో ముగియనున్న ఓటరు నమోదు గడువు
ఉమ్మడి (కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్) జిల్లాల ఎమ్మెల్సీ ఓటర్ నమోదు గడువు నేటితో ముగియనుంది. అర్హులైన పట్టభద్రులు ఫారమ్-18, ఉపాధ్యాయులు ఫారమ్-19 ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలోని అన్ని ఆర్డీవో, తహశీల్దార్ కార్యాలయాల్లో అందజేయాలని వారన్నారు.. ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశముందని వారు పేర్కొన్నారు.