News September 10, 2025

మ్యారేజ్ బ్యూరో అంటూ ప్రొఫెసర్ కూతురికి వల

image

సైబర్ నేరగాడి వలకు చిక్కి ఓ ప్రొఫెసర్ కూతురు రూ.90 వేలు మోసపోయిన ఘటన తిరుపతిలో చోటు చేసుకున్నట్లు రూరల్ CI చిన్నగోవిందు తెలిపారు. ఆయన వివరాలు మేరకు.. మ్యారేజ్ బ్యూరో ద్వారా సంజయ్ అనే పేరుతో ఉన్న వ్యక్తి వెటర్నటీ వర్సిటీలో పని చేస్తున్న ప్రొ. కూతురికి దగ్గర అయ్యాడు. ఆమెను నమ్మించి రూ.90 వేలు ఫోన్ పే చేయించుకున్నాడు. అనంతరం ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో మోసపోయానని గ్రహించిన ఆమె PSలో ఫిర్యాదు చేసింది.

Similar News

News December 15, 2025

సిద్దిపేటలో బీఆర్ఎస్ 78 సీట్లు కైవసం

image

సిద్దిపేట నియోజకవర్గంలో మొత్తం 91 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా.. బీఆర్ఎస్ 78 సీట్లు కైవసం చేసుకోగా అధికార కాంగ్రెస్ 5 పంచాయతీ స్థానాలు వెల్కటూర్, బూరుగుపల్లి, రాంపూర్, నాగరాజు పల్లి, బచ్చాయిపల్లిలో గెలిచింది. బీజేపీ 2 పంచాయతీ స్థానాలు చందలా పూర్, నాంచారుపల్లి గెలవగా ఇండిపెండెంట్ -6 తడకపల్లి, అల్లీపూర్, కోదండరావుపల్లి, సిద్దన్నపేట, ఖానాపూర్, రాజ్ గోపాల్ పేట్ గెలుపొందారు.

News December 15, 2025

ఇవాళ కన్హా శాంతివనానికి సీఎం చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు ఇవాళ శంషాబాద్‌లోని కన్హా శాంతివనాన్ని సందర్శించనున్నారు. ఉదయం 11గంటలకు జూబ్లీహిల్స్ నుంచి బయలుదేరి శాంతి వనం అధ్యక్షుడితో భేటీ కానున్నారు. తర్వాత యోగా, వెల్‌నెస్ సెంటర్లను పరిశీలించనున్నారు. అనంతరం అమరావతికి బయలుదేరుతారు. సాయంత్రం విజయవాడలో జరిగే పొట్టిశ్రీరాములు ఆత్మార్పణదినం కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. కాగా కన్హా శాంతివనం ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యానకేంద్రాలలో ఒకటిగా ఉంది.

News December 15, 2025

దురదృష్టం.. ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పోటీ చేసినా

image

TG: సూర్యాపేటలోని గుడిబండ గ్రామంలో ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసిన వెంకటేశ్వర్లుకు దురదృష్టం వెంటాడింది. కేవలం పది ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. మంత్రి ఉత్తమ్, ఆయన సతీమణి పద్మావతి వ్యక్తిగతంగా మద్దతు తెలిపినా వెంకటేశ్వర్లుకు పరాజయం తప్పలేదు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి నాగయ్య చేతిలో ఓడారు. వెంకటేశ్వర్లు పదవీకాలం మరో 5 నెలల్లో ముగియనుండగా VRS తీసుకొని పోటీ చేశారు.