News February 18, 2025

యర్రగొండపాలెం తహశీల్దార్‌పై సస్పెన్షన్ వేటు

image

యర్రగొండపాలెం తహశీల్దార్‌పై సస్పెన్షన్ వేటు పడింది. రూ.5 కోట్ల విలువైన స్థలం విషయంలో అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలపై తహశీల్దార్ బాల కిషోర్‌ను జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా సస్పెండ్ చేశారు. ఈ వ్యవహారంలో భాగస్వాములైన వీఆర్వో యల్లయ్య, సర్వేయర్ దిలీప్‌లను కూడా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని యర్రగొండపాలెం ఇన్‌ఛార్జ్ తహశీల్దార్ నలగాటి మల్లికార్జున మంగళవారం తెలిపారు.

Similar News

News April 14, 2026

మార్కాపురంలో అగ్నిమాపక వారోత్సవాలు

image

మార్కాపురంలో అగ్నిమాపక వారోత్సవాలను జిల్లా కలెక్టర్ విజయ సునీత మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అగ్ని ప్రమాదంలో అసువులు బాసిన అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఫైర్ ఎక్యూప్మెంట్ స్టాల్‌ను, పాంప్లెట్లు, పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. అగ్ని ప్రమాదాల పట్ల ప్రజల అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఫైర్ ఆఫీసర్ ఆర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

News April 14, 2026

ప్రకాశం: మరో ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం

image

మద్దిపాడు మండలం దొడ్డవరప్పాడు బస్టాండ్ సమీపంలో జాతీయరహదారిపై మంగళవారం తెల్లవారుజామున పెను ప్రమాదం తప్పింది. చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు ముందు టైరు పగలడంతో అదుపు తప్పి డివైడర్ మీదకు వెళ్లింది. ఆ సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఏమి కాలేదు. తరచూ ట్రావెల్ బస్సులు ప్రమాదాలకు గురవటం ఒకింత ఆందోళనకు గురి చేస్తుంది.

News April 14, 2026

బాలికపై అత్యాచారం.. నిందితుడికి జైలుశిక్ష: ప్రకాశం ఎస్పీ

image

బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి 3 సంవత్సరాల జైలు శిక్షతోపాటు రూ.5వేల జరిమానా విధిస్తూ ఒంగోలు POCSO కోర్టు తీర్పు వెలువరించింది. దొనకొండ మండలానికి చెందిన వ్యక్తి 14 ఏళ్ల బాలికను మాయమాటలతో హైదరాబాద్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. పోలీసుల దర్యాప్తుతో నేరం రుజువై శిక్ష విధించగా.. సంబంధిత అధికారులను ఎస్పీ హర్షవర్ధన్ రాజు పోలీసులను అభినందించారు.