News November 8, 2025

యసీన్ పటేల్ ఊచకోత.. భారత్ ఓటమి

image

హాంకాంగ్ సిక్సెస్ టోర్నీలో కువైట్ చేతిలో భారత్‌ ఓడిపోయింది. తొలుత కువైట్ 6 ఓవర్లలో 106-5 స్కోర్ చేసింది. ఆ జట్టులోని యసీన్ పటేల్ 14 బంతుల్లోనే 58 రన్స్(8 సిక్సర్లు,2 ఫోర్లు) చేశారు. చివరి ఓవర్‌లో వరుసగా 6, 6, 6, 6, 6, 2 బాదారు. తర్వాత భారత్ 5.4 ఓవర్లలో 79 రన్స్‌కే 6 వికెట్లు కోల్పోయి ఆలౌటైంది. ఈ టోర్నీలో ఇరు జట్లు చెరో 6 ఓవర్లు ఆడతాయి. ఒక్కో టీమ్ నుంచి ఆరుగురు మాత్రమే బ్యాటింగ్ చేస్తారు.

Similar News

News January 14, 2026

శ్రీకాకుళం: భోగికి దూరంగా బూరవెల్లి, లింగాలవలస గ్రామాలు

image

శ్రీకాకుళం జిల్లాలో గార మండలంలోని బూరవెల్లి, జలుమూరు మండలం లింగాలవలస గ్రామస్థులు భోగి పండగకు దూరంగా ఉంటారు. ఇతర ప్రాంతాల్లో ఉండే బంధువులంతా వచ్చినా ఇక్కడ భోగి మంటను మాత్రం వేయరు. సంక్రాంతి, కనుమ, ముక్కనుమను అందరిలాగే ఘనంగా జరుపుకొంటారు. పెద్దల కాలం నుంచి గ్రామంలో భోగి మంటను వేయడం లేదని, అందువల్ల తాము కూడా భోగి పండుగకు దూరంగా ఉంటామని బూరవెల్లి గ్రామస్థులు చెబుతున్నారు.

News January 14, 2026

సంక్రాంతి ముగ్గులు.. 4 వైపులా గీతలు గీస్తున్నారా?

image

ముగ్గును ఎప్పుడూ ఇంటి గడప, వాకిలి ముందే వేయాలి. ముగ్గు వేసిన తర్వాత నాలుగు వైపులా అడ్డగీతలు గాలి. ఇలా చేయడం వల్ల దుష్టశక్తులు ఇంట్లోకి ప్రవేశించవని, లక్ష్మీదేవి ఇంటిని విడిచి వెళ్లదని శాస్త్రం చెబుతోంది. అంతేకాకుండా ఆ గీతలు అక్కడ శుభకార్యాలు జరుగుతున్నాయనే మంగళకరమైన సంకేతాన్ని ఇస్తాయి. ఈ నియమాలు పాటిస్తూ ముగ్గులు వేస్తే ఆ ఇల్లు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతుంది.

News January 14, 2026

T20 వరల్డ్ కప్‌: USA ప్లేయర్ల వీసాపై ఉత్కంఠ

image

T20 వరల్డ్ కప్‌కు ముందు USA క్రికెట్ జట్టుకు అనూహ్య సమస్య ఎదురైంది. పాకిస్థాన్ సంతతికి చెందిన అలీఖాన్, షయాన్ జహంగీర్, మొహమ్మద్ మొహ్సిన్, ఎహ్సాన్ ఆదిల్‌లు భారత్‌కు వచ్చేందుకు వీసా క్లియరెన్స్ కోసం ఎదురుచూస్తున్నారు. శ్రీలంకలోని భారత హైకమిషన్‌లో వీసా ప్రక్రియ పూర్తి చేసినప్పటికీ విదేశాంగ శాఖ నుంచి తుది అనుమతులు అవసరమని అధికారులు తెలిపారు. అయితే ఇది సాధారణ ప్రక్రియేనని ICC వర్గాలు స్పష్టం చేశాయి.