News September 13, 2025
యాకుత్‌పురా ఘటనకు.. బాధ్యులపై హైడ్రా చర్యలు

యాకుత్‌పురా మౌలకా చిల్కాలోనీ మ్యాన్ హోల్లో చిన్నారి పడిపోయిన ఘటనను హైడ్రా సీరియస్‌గా పరిగణించింది. దీనిపై హైడ్రా క్షుణ్నంగా విచారించింది. బుధవారం సిల్ట్‌ను తొలగించడానికి తెరచిన మ్యాన్ హోల్ మూయకపోవడంతో గురువారం పాఠశాలకు వెళ్తున్న చిన్నారి అందులో పడిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో డీఆర్ఎఫ్ సూపర్‌వైజర్లు ఇద్దరికి డిమోషన్, ఇద్దరిని తొలగించాలని ఆదేశించింది.
Similar News
News December 10, 2025
వనపర్తి: జీపీ ఎన్నికల ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

వనపర్తి జిల్లాలో గురువారం జరగనున్న మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. మొదటి విడత ఎన్నికలు నిర్వహించనున్న 5 మండలాలలో ప్రీ-పోల్ ఏర్పాట్లు పూర్తిచేశామని, అన్ని వైన్ షాపులు మూసివేశామని కలెక్టర్ వివరించారు.
News December 10, 2025
GWL: 974 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు: కలెక్టర్

గద్వాల, ధరూర్, గట్టు, కేటీదొడ్డి మండలాల్లో మొత్తం 974 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ సంతోష్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 1,50,672 మంది ఓటర్ల డేటాను పరిగణలోకి తీసుకున్నామన్నారు. మొదటి విడతలో ఏర్పాటు చేసిన 974 కేంద్రాల్లో 135 కేంద్రాలు ఏకగ్రీవ గ్రామాల పరిధిలోకి వస్తాయని వివరించారు.