News August 14, 2025
యాక్సిడెంట్‌లో మంచిర్యాల వాసులు దుర్మరణం

JGTL(D) వెల్గటూర్(M)లో బుధవారం రాత్రి RTC బస్సు గేదెను ఢీకొని అదుపుతప్పి బైక్‌ను ఢీకొనడంతో ఇద్దరు యువకులు మృతిచెందారు. MNCL(D) లక్షెట్టిపేట(M) ఇటిక్యాలకు చెందిన మేడి గణేశ్(24), ముచ్చకుర్తి అనిల్(25) వెల్గటూర్ నుంచి రాయపట్నం వైపు వస్తుండగా ప్రమాదం జరిగింది. అనిల్ అక్కడికక్కడే చనిపోగా.. గణేశ్‌ను ధర్మపురి ఆసుపత్రికి తరలించగా అక్కడ మృతిచెందారు. అనిల్ రామగుండం కమిషనరేట్‌లో కానిస్టేబుల్‌గా చేస్తున్నారు.
Similar News
News March 6, 2026
10 రోజులు కరెంట్ కోతలు.. ఎందుకంటే?

TG: రాష్ట్రంలో రాబోయే 10 రోజులు గృహ అవసరాలకు షెడ్యూల్ చేయని కరెంట్ కోతలు ఉంటాయని తెలుస్తోంది. విద్యుత్ డిమాండ్ పెరగడంతో హైదరాబాద్‌తో సహా అనేక చోట్ల పవర్ సప్లై పరికరాలు ఓవర్‌లోడ్‌ను ఎదుర్కొంటున్నాయి. దీంతో అధికారులు నిర్వహణ పనులు చేపట్టారు. ఈ పనుల పూర్తికి కనీసం వారం పట్టనుంది. గ్రామాల్లోనూ పాత ట్రాన్స్‌ఫార్మర్‌లను మారుస్తున్నారు. డిమాండ్‌కు తగ్గట్లు విద్యుత్ ఉత్పత్తి చేస్తామని అధికారులు తెలిపారు.
News March 6, 2026
పునరావాస కేంద్రాల్లో ‘భూదాన్’ బాధితుల అరిగోస

ఖమ్మంలోని అంబేద్కర్ భవన్, టీటీడీసీ పునరావాస కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లేక వెలుగుమట్ల భూదాన్ భూముల బాధితులు అవస్థలు పడుతున్నారు. కనీసం వాష్‌రూమ్ సౌకర్యం కూడా లేదని, స్వచ్ఛంద సంస్థలు అందించే భోజనమే దిక్కని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే పునరావాస కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
News March 6, 2026
శాసనమండలిలో వైయస్‌ఆర్‌సీపీ మరో వాయిదా తీర్మానం

ఏపీ శాసనమండలిలో వైఎస్సార్‌సీపీ సభ్యులు మరోసారి వాయిదా తీర్మానం ఇచ్చారు. విశాఖలో గీతం యూనివర్సిటీకి సంబంధించిన రూ.5 వేల కోట్ల విలువైన భూదోపిడీ అంశంపై మండలిలో చర్చ జరపాలని డిమాండ్ చేశారు. నిన్న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును పదవి నుంచి తొలగించాలంటూ వాయిదా తీర్మానం ఇచ్చినప్పటికీ ప్రభుత్వం చర్చకు అనుమతించలేదని విమర్శించారు. విశాఖ భూముల వ్యవహారంపై చర్చించే ధైర్యం ఉందా అని సీఎం చంద్రబాబును ప్రశ్నించారు


