News August 11, 2025
యాచారం: ట్రాక్టర్ ఢీకొని 3ఏళ్ల బాలిక మృతి

అప్పటి వరకు ఇంటి ముందు ఆడుకున్న పాపాయిని ట్రాక్టర్ మృత్యువు రూపంలో కబలించింది. స్థానికుల వివరాలిలా.. రంగారెడ్డి జిల్లా యాచారం పరిధి మేడిపల్లి నక్కర్త గ్రామ పంచాయతీ ట్రాక్టర్ వన్నాడపు బీరప్ప కుమార్తె అవంతిక (3)ను ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడింది. వెంటనే కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాలిక మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News March 6, 2026
HYD: హాస్టల్ నుంచి వెళ్లి.. VKBలో లవ్ మ్యారేజ్

పర్మిషన్ లేకుండా హాస్టల్ నుంచి ఓ విద్యార్థిని వెళ్లిపోయిన ఘటన ఘట్‌కేసర్ PS పరిధిలో జరిగింది. SHO బాలస్వామి వివరాలిలా.. వికారాబాద్(D) ధారూర్‌కు చెందిన విద్యార్థిని(19) అంకుషాపూర్ సోషల్ వెల్ఫేర్ మహిళా డిగ్రీ కాలేజీలో 2nd ఇయర్ చదువుతోంది. ఈ నెల 4న హాస్టల్ నుంచి వెళ్లింది. ప్రిన్సిపల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. VKBలో ప్రియుడితో వివాహం చేసుకున్నట్లు లోకల్ PS నుంచి ఘట్‌కేసర్ ఠాణాకు సమాచారమందింది.
News March 6, 2026
HYD: 36 గంటలు నీటి సరఫరాకు బ్రేక్

HYDలోని పలు కీలక ప్రాంతాల్లో శనివారం ఉదయం నుంచి 36 గం. పాటు తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని జలమండలి తెలిపింది. ట్రాన్స్‌మిషన్ I & ll విభాగాలతో పాటు మణికొండ, కోకాపేట్, నార్సింగి, షేక్‌పేట్‌తో పాటు భోజగుట్ట ప్రాంతానికి తక్కువ ప్రెజర్‌తో నీరు సరఫరా అవుతుందని, సరఫరాలో అంతరాయం ఉంటుందని ప్రకటించింది. మంజీరా ఫేజ్-3, పెద్దాపూర్ పంప్ హౌస్‌లో మరమ్మతులు, ఆధునీకరణ పనుల కారణంగా HMWSSB ఈ నిర్ణయం తీసుకుంది.
News March 6, 2026
HYD: మీ గుడి నుంచి పూజలు.. రూ.50 వేల ఆదాయం

ప్రముఖ ఆధ్యాత్మిక ప్లాట్‌ఫాం వేదమందిర్‌కు సేవలందించేందుకు పురోహితులు కావలెను. మీ ప్రాంతంలోనే ఉండి, మీ దైనందిన కార్యక్రమాలు చూసుకుంటూనే మా కస్టమర్లకు సేవలు అందించవచ్చు. దీంతో మీరు నెలకు రూ.40వేల నుంచి రూ.50 వేల వరకు పొందుతారు. ఆసక్తి గల పురోహితులు <


