News August 20, 2025

యాదగిరిగుట్ట ఆలయానికి నాలుగు ISO సర్టిఫికెట్లు

image

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి ISO 9001, ISO 22000తో సహా మొత్తం నాలుగు సర్టిఫికేషన్ పురస్కారాలు లభించాయి. దేశంలోనే ఎనర్జీ ఆడిట్ నిర్వహించిన తొలి ఆలయంగా, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించినందుకు, ప్రసాదాల తయారీలో అత్యున్నత ప్రమాణాలు పాటించినందుకు ఈ అవార్డులు వచ్చాయి. ఈ సర్టిఫికెట్లను డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క సమక్షంలో ఆలయ అధికారులకు ఈరోజు HYDలో అందజేశారు.

Similar News

News January 17, 2026

5 రోజుల్లో రూ.226కోట్లు కలెక్ట్ చేసిన MSVG

image

మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా కలెక్షన్లలో దూసుకెళ్తోంది. రిలీజైన 5 రోజుల్లోనే ఈ చిత్రం రూ.226 కోట్లు (గ్రాస్) కలెక్ట్ చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. ఓ ప్రాంతీయ చిత్రానికి ఇది ఆల్ టైమ్ రికార్డ్ అని వెల్లడించారు. కాగా ఇవాళ, రేపు ఇదే ఊపు కొనసాగే ఛాన్స్ ఉందని సినీవర్గాలు అంచనా వేస్తున్నాయి.

News January 17, 2026

HYD: ఫేక్ టాబ్లెట్ గుర్తుపట్టడం ఎలా..?

image

HYDలో పలుచోట్ల నకిలీ మందులు విక్రయిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మందులు కొనుగోలు చేసే సమయంలో స్ట్రిప్‌‌పై బ్యాచ్ నంబర్, తయారీ, గడువు తేదీలు, కంపెనీ పేరు స్పష్టంగా ఉన్నాయా..? చూడాలి. బిల్ తప్పనిసరిగా తీసుకోవాలి. అనుమానం వస్తే DGCA వెబ్‌సైట్‌లో బ్యాచ్ వివరాలు చెక్ చేయాలి. ఫిర్యాదులకు 18005996969 నంబర్‌కు కాల్ చేయండి.

News January 17, 2026

ASF జిల్లాలో పెరుగుతున్న ఆత్మహత్యలు

image

ASF జిల్లాలోని 2023 సంవత్సరంలో 156, 2024లో 159, 2025లో 165 మంది ఆత్మహత్య చేసుకున్నారు. జిల్లాలో గత మూడేళ్ల నుంచి ఆత్మహత్యల నివేదికను పరిశీలిస్తే, ఏటా వీటి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఏటా జిల్లాలో ఆత్మహత్యల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూనే ఉందని గణాంకాలు చెబుతున్నాయి. బలమైన కారణాలు లేనప్పటికీ క్షణికావేశంలో బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ఆత్మహత్యను అరికట్టేందుకు 14416 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలి.