News August 23, 2025

యాదాద్రి ఆలయ పాలక మండలి నియామకం ఎప్పుడో..?

image

తిరుపతి దేవస్థానం తరహాలో యాదాద్రి ఆలయానికి ప్రత్యేక పాలక మండలి ఏర్పాటు చేయనున్నట్లు ఏడాది క్రితం స్వయంగా CM రేవంత్ ప్రకటించారు. ఇప్పటికీ పాలక మండలి ఏర్పాటుపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో వైటీడీఏ నియామకంపై ఆశావహులలో నిరుత్సాహం నెలకొంది. తిరుపతి మాదిరిగానే యాదాద్రి ఆలయాన్ని అభివృద్ధి చేసి, పరిపాలనా వ్యవహారాలను పర్యవేక్షించడానికి ఈ పాలక మండలిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

Similar News

News January 25, 2026

NZB: మున్సిపల్ ఎన్నికల BRS ఇన్‌ఛార్జీలు వీరే..

image

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లాలోని కీలక ప్రాంతాలకు ఇన్‌ఛార్జీలను నియమించింది. నిజామాబాద్ కార్పొరేషన్ బాధ్యతలను రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డికి అప్పగించారు. బోధన్ మున్సిపాలిటీకి దాదన్నగారి విఠల్ రావు, ఆర్మూర్‌కు చెరుమల్ల రాకేష్, బాల్కొండకు సుమనా రెడ్డిలను ఇన్‌ఛార్జీలుగా అధిష్ఠానం ఖరారు చేసింది. పార్టీ కేడర్‌ను సమన్వయం చేస్తూ గెలుపే లక్ష్యంగా వీరు పనిచేయనున్నారు.

News January 25, 2026

విడవలూరు: 54 మంది అరెస్ట్

image

విడవలూరు(M) పెద్దపాలెం బంకింగ్ కెనాల్ వద్ద కోడిపందేల స్థావరాలపై పోలీసులు <<18948979>>దాడులు<<>> చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 54 మందిని అరెస్ట్ చేసినట్లు సీఐ సురేంద్రబాబు తెలిపారు. వారి నుంచి రూ.6,24,500 నగదు, 9 కార్లు, 2 ఆటోలు,14 కోళ్లు, కోడి కత్తులు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. నిర్వాహకులపై సైతం కేసులు నమోదు చేశామన్నారు.

News January 24, 2026

జూన్ లోపు టిడ్కో ఇళ్లు పంపిణీ చేయాలి: నారాయణ

image

అభివృద్ధి పనుల్లో ఎక్కడా రాజీ పడొద్దని మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. శనివారం నెల్లూరులోని తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. అసంపూర్తిగా ఉన్న టిడ్కో ఇళ్ల పనులను వేగవంతం చేసి, జూన్ నాటికి లబ్ధిదారులకు అందజేయాలని స్పష్టం చేశారు.