News October 6, 2025

యాదాద్రి: కూతురు ప్రేమ వివాహం.. తండ్రి ఆత్మహత్య

image

మోత్కూరు మండలంలోని సాయిబాబా కాలనీలో నివాసముంటున్న ఇంద్రాల మల్లయ్య (45) ఆదివారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఐదు నెలల క్రితం కూతురు ప్రేమ వివాహం చేసుకొని వెళ్లిపోవడంతో, ఆ మానసిక వేదనతోనే ఆయన ఈ దారుణానికి ఒడిగట్టినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరి వేసుకుని మృతి చెందాడు. ఈ ఘటనపై మోత్కూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News January 17, 2026

పెళ్లి చేసుకుంటే రూ.2లక్షలు.. నేటి నుంచే అమల్లోకి

image

TG: దివ్యాంగుల వివాహానికి రూ.2 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని CM రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించిన <<18836703>>విషయం<<>> తెలిసిందే. ఇది నేటి నుంచి అమల్లోకి వచ్చినట్లు ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఆర్థిక సాయం భార్య పేరున జమ చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో దివ్యాంగ దంపతులకు వివాహానంతరం ఎదురయ్యే ఆర్థిక ఒత్తిళ్లు తగ్గడంతోపాటు, నివాసం, వైద్య ఖర్చులు, జీవనోపాధికి సహాయ పడుతుందని పేర్కొంది.

News January 17, 2026

19న శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లు

image

తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల(సుప్రభాతం, తోమాల, అర్చన) ఏప్రిల్ కోటాను ఈనెల 19న TTD విడుదల చేయ‌నుంది. ఈ-డిప్ కోసం 21వ తేదీ 10AM వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. టికెట్లు పొందిన వారు 23న 12PM లోపు డబ్బు చెల్లిస్తే టికెట్లు మంజూరవుతాయి. 22న ఆర్జిత సేవ టికెట్లు(కళ్యాణోత్సవం), 23న అంగ ప్రదక్షిణ టోకెన్లు, శ్రీవాణి ట్రస్టు టికెట్లు, 24న ప్రత్యేక ప్రవేశ దర్శన కోటా టికెట్లు విడుదల కానున్నాయి.

News January 17, 2026

రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యం: కలెక్టర్

image

రైతుల ఆదాయం పెంపే లక్ష్యంగా మండల స్థాయిలో కార్యాచరణాత్మక వ్యవసాయ ప్రణాళికలు అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి ఆదేశించారు. ఈ-క్రాప్ బుకింగ్‌ను నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని, వరికి బదులుగా మల్లెపూలు, డ్రాగన్ ఫ్రూట్, బొప్పాయి, అరటి వంటి పంటలను ప్రోత్సహించాలని సూచించారు. పంట సేకరణ, మార్కెటింగ్‌లో రైతులకు ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.