News November 19, 2025

యాదాద్రి గిరి ప్రదక్షిణకు పటిష్ఠ ఏర్పాట్లు: ఈవో

image

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా నేడు జరిగే గిరి ప్రదక్షిణకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో వెంకట్రావు తెలిపారు. ప్రదక్షిణ ఉదయం 5:30 గంటలకు కొండ కింద వైకుంఠ ద్వారం వద్ద ప్రత్యేక పూజలతో ప్రారంభమవుతుందని ఆయన అన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని ఈవో కోరారు.

Similar News

News January 24, 2026

అనకాపల్లి మీదుగా విశాఖ చర్లపల్లి మధ్య ప్రత్యేక రైలు

image

అనకాపల్లి మీదుగా విశాఖ-చర్లపల్లి-విశాఖ మధ్య ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు వాల్తేరు డివిజనల్ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 25 సాయంత్రం ఐదున్నర గంటలకు విశాఖలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం చర్లపల్లి చేరుకుంటుందన్నారు. తిరుగు ప్రయాణంలో ఈ నెల 26 మధ్యాహ్నం 3:30 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం విశాఖ చేరుకుంటుందన్నారు. దీనికి అనకాపల్లిలో హాల్ట్ సౌకర్యం ఉందన్నారు.

News January 24, 2026

IRELలో 30 పోస్టులకు నోటిఫికేషన్

image

కేరళలోని ఇండియన్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్ (<>IREL<<>>) 30 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. BE/BTech, BCom, BSc, MBA, PG, డిప్లొమా, ఐటీఐ అర్హత గల అభ్యర్థులు NATS/NAPS పోర్టల్‌లో మార్చి 15వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వయసు 18 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.irel.co.in/

News January 24, 2026

HYD: ‘జూబ్లీహాల్’ పేరెలా వచ్చిందంటే?

image

మన HYD చారిత్రక కట్టడాలకు నిలయం. వందలేళ్ల బంగ్లాలు నేటికీ చెక్కుచెదరకుండా చెమక్కుమంటున్నాయి. 1913లో 7వ నిజాం బాగ్-ఇ-ఆమ్‌(పబ్లిక్ గార్డెన్)లో ఇండో-పర్షియన్ శైలిలో ఓ అద్భుత భవనం నిర్మించారు. తన 25 ఏళ్ల పాలన పూర్తైన సందర్భంగా 7వ నిజాం ఇక్కడ సిల్వర్ జూబ్లీ వేడుకలు జరిపారు. అప్పటినుంచి ఇది ‘జూబ్లీహాల్‌’గా ప్రసిద్ధి చెందింది. 27 ఏళ్ల పాటు రాష్ట్ర శాసన మండలి ఈ భవనంలో కొనసాగింది. మీరెప్పుడైనా చూశారా?