News November 30, 2025
యాదాద్రి గిరి ప్రదక్షిణకు ఏర్పాట్లు పూర్తి: ఈవో వెంకట్రావు

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో సోమవారం అయ్యప్ప స్వాములతో నిర్వహిస్తున్న గిరిప్రదక్షిణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈవో వెంకట్రావు తెలిపారు. రేపు ఉదయం 5.30 గంటలకు స్వామివారి కొండ కింద వైకుంఠ ద్వారం వద్ద ప్రత్యేక పూజలతో ఈ ప్రదక్షిణ ప్రారంభమవుతుందన్నారు. భక్తులు, అయ్యప్ప స్వాములు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆయన కోరారు.
Similar News
News February 9, 2026
శ్రీవారి భక్తులకు శుభవార్త

AP: తిరుమలలో సులభంగా లడ్డూలు పొందేందుకు వీలుగా విక్రయ కేంద్రాల్లో UPI పేమెంట్లను అనుమతించాలని TTD నిర్ణయించింది. ప్రస్తుతం క్యాష్ ద్వారానే లడ్డూలు తీసుకునే పరిస్థితి ఉంది. కియోస్క్ యంత్రాలను అందుబాటులో తెచ్చినప్పటికీ సాంకేతిక సమస్యలతో ఇబ్బందులొస్తున్నాయి. దీంతో కౌంటర్ల వద్దే పేమెంట్ క్యూఆర్ కోడ్ బోర్డులను ఏర్పాటు చేయనున్నారు. తొలుత కొన్ని కౌంటర్లలో అమలు తర్వాత అన్ని కేంద్రాలకూ విస్తరిస్తారు.
News February 9, 2026
NGKL: ఎన్నికల ప్రచారానికి నేడే చివరి రోజు

మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి ఈరోజు సాయంత్రం చివరి రోజు కావడంతో అన్ని పార్టీల నాయకులు తమ ప్రచారాన్ని ఉద్ధృతం చేశారు. జిల్లాలోని కల్వకుర్తి, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీలలో ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కొల్లాపూర్‌లో 19, కల్వకుర్తిలో 22, నాగర్ కర్నూల్ లో 24 కౌన్సిలర్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థులు పొటా పోటీ ప్రచారం చేశారు.
News February 9, 2026
KMR: భార్య మృతిపై మావోయిస్టు ప్రభాకర్ కన్నీటి లేఖ

మరణించిన మావోయిస్టు నేత ప్రభాకర్, తన భార్య నవత మృతి సమయంలో రాసిన లేఖ సోషల్ మీడియాలో అందరినీ కదిలిస్తోంది. భార్యాపిల్లలను కలుసుకోవాలనే ఆశతో ప్రయాణమైన ప్రభాకర్‌కు, గమ్యం చేరేలోపే భార్య మృతి చెందిందనే వార్త వినాల్సి వచ్చింది. చివరి చూపు కూడా నోచుకోలేని పరిస్థితులపై ఆయన ఆవేదన చెందారు. ‘నీ గొంతులో ఊపిరి ఉన్నంతవరకు వర్గ రహిత సమాజ స్థాపన కోసం పోరాడతానన్న శపథాన్ని నిలబెట్టుకున్నావు’ అని కొనియాడారు.


