News August 13, 2025
యాదాద్రి: చనిపోతూ.. ఆరుగురికి పునర్జన్మ

అవయవదానంపై ఉన్న అపోహలను తొలగించి, ఆరుగురికి పునర్జన్మ ఇచ్చింది మోత్కూర్ మండలం అనాజిపురం గ్రామానికి చెందిన నల్ల పరమేష్ కుటుంబం. 2021లో జరిగిన రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన పరమేష్, మరణం తర్వాత కూడా తన అవయవాలను దానం చేసి ఆరుగురి జీవితాలను నిలిపారు. ఈ గొప్ప నిర్ణయం తీసుకున్న పరమేష్ కుటుంబం ఆదర్శనీయం అని పలువురు కొనియాడారు.
# నేడు ప్రపంచ అవయవ దాన దినోత్సవం
Similar News
News March 14, 2026
మాది పీపుల్ ఫ్రెండ్లీ ప్రభుత్వం: పవన్ కళ్యాణ్

నందిగరువులో నిర్వహించిన మాటా మంతీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గిరిజనుల సమస్యలు విని కొన్ని వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. తమది పీపుల్ ఫ్రెండ్లీ ప్రభుత్వమని, అందుకే నేరుగా వచ్చి సమస్యల వింటున్నామన్నారు. గత ప్రభుత్వంలో నిధుల మళ్లింపుతో ఏజెన్సీ ప్రాంతం అభివృద్ధిలో వెనుకబడి పోయిందని, తాము అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో గిరిశిఖర గ్రామాల్లో 460 కిలోమీటర్ల రోడ్లు నిర్మించామన్నారు.
News March 14, 2026
GWL: సిలిండర్లు బ్లాక్‌లో విక్రయిస్తే కఠిన చర్యలు

గృహ వినియోగానికి సంబంధించిన గ్యాస్ సిలిండర్లను బ్లాక్‌లో విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని గద్వాల కలెక్టర్ రిజ్వానా బాషా షేక్ పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్‌లో పోలీసు, సివిల్ సప్లై అధికారులు, గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో గ్యాస్ సమస్యల తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లుకు గ్యాస్ కొరత లేకుండా చూడాలన్నారు.
News March 14, 2026
కోదాడలో 42 గ్యాస్ సిలిండర్ల స్వాధీనం

కోదాడ పట్టణంలోని అంబేడ్కర్ కాలనీలో అక్రమంగా నిల్వ ఉంచిన 42 గ్యాస్ సిలిండర్లను సివిల్ సప్లై అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. కృష్ణారెడ్డి అనే వ్యక్తి ఇంట్లో డొమెస్టిక్ సిలిండర్ల నుంచి చిన్న సిలిండర్లలోకి గ్యాస్ మారుస్తున్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా రీఫిల్లింగ్ పరికరాలను సీజ్ చేసి, నిందితుడిపై కేసు నమోదు చేశారు. అనంతరం పంచనామా నిర్వహించి సిలిండర్లను శ్లోక గ్యాస్ గోదాముకు తరలించారు.


