News March 13, 2025

యాదాద్రి: ట్యాంకర్లతో పొలాలు తడుపుతున్నారు

image

భువనగిరి మండలం గౌస్‌నగర్‌లో రైతులు ట్యాంకర్ల ద్వారా పొలాలు తడుపుతున్నారు. భూగర్భ జలాలు అడుగంటిపోయి పంటలు ఎండిపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. చేతికొచ్చిన పంట ఎండిపోతోందని ట్యాంకర్ నీళ్లు కొనుగోలు చేసి పంట పొలాలను తడుపుతున్నామన్నారు. ప్రభుత్వం స్పందించి బస్వాపురం రిజర్వాయర్ నుంచి నీరు విడుదల చేసి ఆదుకోవాలన్నారు. 

Similar News

News February 17, 2026

ఇండియాకు మాక్రాన్.. రఫేల్ డీల్‌పై ఫోకస్!

image

ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భారత్ చేరుకున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆయన ఈరోజు ముంబైలో ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. ‘హొరైజాన్ 2047 రోడ్‌మ్యాప్’లో భాగంగా డిఫెన్స్, స్పేస్, అణుశక్తి ఇలా వివిధ అంశాల్లో ఇరు దేశాల సహకారంపై చర్చించనున్నారు. ఈ సందర్భంగా 114 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుపైనా భారీ డీల్ కుదిరే అవకాశం ఉంది. ఢిల్లీలో జరిగే AI సమ్మిట్‌లోనూ మెక్రాన్ పాల్గొననున్నారు.

News February 17, 2026

KMR: పురం.. సమస్యల వలయం

image

కామారెడ్డి జిల్లాలో నూతన మున్సిపల్ కౌన్సిల్‌లు కొలువుదీరాయి. నూతన కౌన్సిలర్లకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ఛైర్మన్/ఛైర్‌పర్సన్స్, కౌన్సిలర్లతో సమన్వయం చేసుకుంటూ పరిష్కారాలు చూపాలి. చెత్త నిర్వహణ సరిగ్గా లేక ఆయా మున్సిపాలిటీలు పేరుకుపోయాయి. ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలి. అండర్ డ్రైనేజ్ వ్యవస్థ తీసుకురావాలి. నగర సుందరీకరణకు పాటుపడాలి. ఎల్లారెడ్డి, బిచ్కుందలో నూతన భవన నిర్మాణాలు చేపట్టాలి.

News February 17, 2026

మొగళ్లమూరు: ఆస్తి రాసిస్తే అనాథను చేసింది

image

మొగళ్లమూరుకు చెందిన వాసర్ల లక్ష్మి సోమవారం కలెక్టరేట్‌లో తన గోడు వెళ్లబోసుకున్నారు. ఆస్తి రాసిచ్చిన తర్వాత పెంపుడు కుమార్తె తనను నిర్లక్ష్యం చేస్తూ, మానసిక వేధింపులకు గురిచేస్తోందని కలెక్టర్‌కు విన్నవించారు. భర్త మృతితో ఒంటరినైన తనకు న్యాయం చేయాలని కోరారు. గతంలో కుమార్తె పేరిట చేసిన రెండున్నర ఎకరాల దానసెటిల్‌మెంట్ రిజిస్ట్రేషన్ రద్దు చేసి, ఆస్తిని తిరిగి ఇప్పించాలని ఆమె వేడుకున్నారు.