News November 17, 2025
యాదాద్రి: నేటి నుంచి పత్తి మిల్లులు బంద్

నేటి నుంచి జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పత్తి మిల్లుల అసోసియేషన్ నిరవధిక బంద్‌ను పాటించనున్నట్లు పత్తి మిల్లుల అసోసియేషన్ తెలిపింది. కావున రైతులెవరూ మార్కెట్ యార్డ్‌కు పత్తిని తీసుకురావద్దని మిల్లుల యాజమాన్యం కోరింది. దీంతో ఇప్పటికే ఆల్రెడీ స్లాట్ బుక్ చేసుకున్న పత్తి రైతులు ఏం చేయాలో తెలీక అయోమయంలో పడిపోయారు. అధికారులు త్వరగా చర్చలు జరిపి మిల్లులు తెరుచుకునేలా చూడాలని రైతులు కోరుతున్నారు.
Similar News
News January 14, 2026
జనవరి 14: చరిత్రలో ఈరోజు

1896: భారత ఆర్థికవేత్త సి.డి.దేశ్‌ముఖ్ జననం
1937: సినీ నటుడు రావు గోపాలరావు జననం
1937: సినీ నటుడు శోభన్ బాబు జననం(ఫొటో-R)
1951: సినీ దర్శకుడు జంధ్యాల జననం(ఫొటో-L)
1979: కవి కేసనపల్లి లక్ష్మణకవి మరణం
News January 14, 2026
సంక్రాంతి ప్రతిసారి ఒకే తేదీన ఎందుకు వస్తుంది?

దాదాపు మన పండుగలన్నీ చంద్రుని గమనం ఆధారంగా వస్తుంటాయి. అందుకే క్యాలెండర్‌లో ఆ పండుగల తేదీలు మారుతుంటాయి. కానీ సంక్రాంతి సూర్యుని గమనం ఆధారంగా జరుపుకుంటాం. సూర్యుడు ప్రతి ఏడాది ఒకే సమయంలోమకర రాశిలోకి ప్రవేశిస్తాడు. భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే ఈ కాలం స్థిరంగా ఉంటుంది. అందుకే JAN 14/15 తేదీలలోనే సంక్రాంతి వస్తుంది. ఇది ఖగోళ మార్పులకు సంబంధించిన పండుగ కాబట్టి తేదీల్లో మార్పు ఉండదు.
News January 14, 2026
RCPM: గబ్బర్ సింగ్ గెటప్‌లో మంత్రి సుభాష్ కటౌట్

రామచంద్రపురం VSM కాలేజీ గ్రౌండ్‌లో మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో కోనసీమ సంక్రాంతి సంబరాలు మంగళవారం కోలాహలంగా ప్రారంభమయ్యాయి. స్వాగత ద్వారం వద్ద ఏర్పాటు చేసిన మంత్రి కటౌట్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ కటౌట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన ‘గబ్బర్ సింగ్’ గెటప్‌ను పోలి ఉందంటూ వీక్షకులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


