News August 21, 2025

యాదాద్రి: ముదస్తుగానే వైన్స్ టెండర్లు..!

image

కొత్త వైన్స్‌కు ప్రభుత్వం టెండర్లు ఆహ్వానిస్తోంది. ప్రస్తుత దుకాణాల లైసెన్స్ కాలపరిమితి ఈ ఏడాది NOV 30తో ముగియనున్న నేపథ్యంలో ముందస్తుగా 2025 మద్యం టెండర్ విధానాన్ని ప్రకటించింది. 2025 DEC 1 నుంచి 2027 NOV 30 వరకు కాలపరిమితికి టెండర్ ఫీజు ఖరారు చేసింది. మద్యం టెండర్ ఫీజును రూ.2లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచింది. ఒక్కరు ఎన్ని దరఖాస్తులైనా చేసుకోవచ్చు. యాదాద్రి జిల్లా వ్యాప్తంగా 82 వైన్స్‌లు ఉన్నాయి.

Similar News

News January 13, 2026

10 నిమిషాల్లో ఫుడ్ వస్తుంది.. మరి అంబులెన్స్?

image

TG: శంషాబాద్ ఎయిర్‌పోర్టు ప్రధాన రహదారిపై కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో 5నెలల గర్భిణి, ఆమె తల్లి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడారు. విచారకరమైన విషయమేమిటంటే గంట వరకు అంబులెన్స్ రాలేదు. 10ని.ల్లో ఫుడ్ డెలివరీ అయ్యే నగరంలో గంట దాటినా అంబులెన్స్ రాకపోవడం ఆందోళనకరమని నెటిజన్లు మండిపడుతున్నారు. చివరకు ప్రైవేట్ అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. సమయానికి అంబులెన్స్ వస్తే ఎన్నో ప్రాణాలు నిలుస్తాయి.

News January 13, 2026

అన్నమయ్య: మద్యం బాటిల్స్‌పై రూ.10 పెంపు.!

image

అన్నమయ్య జిల్లాలో గతనెల 1,12,282 కేసుల లిక్కర్ (IML), 49,398 కేసుల బీరు తాగేశారు. డిసెంబర్‌లో మద్యం అమ్మకాలతో ప్రభుత్వానికి రూ.78.16 కోట్లు ఆదాయం వచ్చింది. న్యూ ఇయర్ సంబరాల్లో ఒక్కరోజులోనే జిల్లాలో 9216 కేసులు లిక్కర్, 3936 కేసులు బీరు తాగారు. ఆ ఒక్క రోజులోనే రూ.6.50 కోట్ల ఆదాయం లభించింది. ఈ పరిస్థితుల్లో రూ.99ల మద్యం, బీరు మినహా అన్ని బాటిళ్లపై రూ.10లు పెంచుతూ సోమవారం GO విడుదలైన విషయం తెలిసిందే.

News January 13, 2026

VMLD: బద్ది పోచమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు

image

వేములవాడలోని బద్ది పోచమ్మ తల్లి ఆలయానికి మంగళవారం అమ్మవారికి ఇష్టమైన రోజు కావడంతో భక్తులు కుటుంబ సమేతంగా అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయం భక్తులతో రద్దీగా మారింది. ఈ మేరకు భక్తులు ప్రీతికరమైన బోనాల నైవేద్యాలను, పసుపు కుంకుమలను అమ్మవారికి సమర్పించుకున్నారు. అందరిని చల్లగా చూడు తల్లి అంటూ బద్ది పోచమ్మ తల్లిని వేడుకున్నారు. మేడారం జాతర సందర్భంగా మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు తరలివచ్చారు.