News March 8, 2025
యాదాద్రి శ్రీవారి నిత్య ఆదాయ వివరాలు

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు శుక్రవారం సమకూరిన ఆదాయ వివరాలు ఆలయ ఈవో భాస్కరరావు వెల్లడించారు. 576 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా రూ.28,800, ప్రసాద విక్రయాలు రూ.5,66,540, VIP దర్శనాలు రూ.1,65,000, బ్రేక్ దర్శనాలు రూ.1,07,100, లీజస్ రూ.5 లక్షలు, కార్ పార్కింగ్ రూ.1,23,000, వ్రతాలు రూ.49,600, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.16,95,877 ఆదాయం వచ్చింది.
Similar News
News March 27, 2025
పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ అప్పుడేనా..?

మద్యం కేసులో MP మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తారనే ప్రచారం జోరుగుతోంది. ముందస్తు బెయిల్ కోసం ఆయన కోర్టుకు సైతం వెళ్లారు. ఈక్రమంలో ఆయన లాయర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఏప్రిల్ 3 వరకు పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి. ఆ తర్వాత చికిత్స పొందుతున్న తన తండ్రి పెద్దిరెడ్డిని పరామర్శించడానికి వెళ్తారు’ అని ఆయన చెప్పారు. ఆ వెంటనే MPని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన అనుచరుల్లో ఆందోళన నెలకొంది.
News March 27, 2025
భువనగిరిలో ఈనెల 28న ఇఫ్తార్ విందు

భువనగిరిలో ఈనెల 28న శుక్రవారం సాయంత్రం 6 గంటలకు వైఎస్ఆర్ గార్డెన్‌లో ప్రభుత్వం తరఫున ఇఫ్తార్ విందు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు కూర వెంకటేశ్ తెలిపారు. ముస్లింలందరూ పెద్ద ఎత్తున తరలి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి మజహార్, నాయకుడు సలావుద్దీన్, ముస్లింలు పాల్గొన్నారు.
News March 27, 2025
కృష్ణా: నేడు 40 డిగ్రీలపై ఎండ

కృష్ణా జిల్లాలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండనున్నట్లు APSDMA తెలిపింది. గురువారం జిల్లాలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉండే ప్రాంతాలను వెల్లడించింది. నందివాడ 40.7°, బాపులపాడు 41.5°, గన్నవరం 42.4°, కంకిపాడు 41.2°, పమిడిముక్కల 40.2°, పెనమలూరు 41.6°, ఉంగుటూరు 42.2°, పెదపారుపూడి 41.1°, తోట్లవల్లూరు 40.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటాయని తెలిపింది.