News February 18, 2025
యాదాద్రి: హత్య కేసులో 17మందికి జీవిత ఖైదు

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్యకేసు విషయంలో 17 మందికి జీవిత ఖైదు శిక్ష పడింది. నల్లగొండ జిల్లా ఎస్సీ ఎస్టీ, జిల్లా రెండో అదనపు న్యాయమూర్తి రోజా రమణి శిక్షను ఖరారు చేస్తూ మంగళవారం తీర్పునిచ్చారు. ఈ కేసులో మొత్తం 18 మంది నిందితులు ఉండగా అందులో ఒకరు ఇప్పటికే మరణించారు. అడ్డగూడూరుకు చెందిన ఓ వ్యక్తిని హత్య చేసిన విషయంలో వీరికి జీవిత ఖైదు శిక్ష పడింది.
Similar News
News April 14, 2026
గొర్రె పిల్లలకు ఎలాంటి ఆహారం ఇస్తే మంచిది?

గొర్రె పిల్లలకు పుట్టిన మొదటి రోజు నుంచి 20 వారాల వయసు వచ్చేవరకు వివిధ దశలలో సరిపడేంతగా పాలను, క్రీపు దాణాను, T.M.R(టోటల్ మిక్స్‌డ్ రేషన్)ను నిర్దేశిత పరిమాణంలో అందించాలి. వీటిని సరైన పరిమాణంలో అందిస్తే 5 లేదా 6 నెలల వయసులోనే గొర్రె పిల్లలు 28 నుంచి 30 కిలోల బరువు పెరుగుతాయి. దీని వల్ల త్వరగా వీటిని కోతకు అమ్మి మంచి ఆదాయం పొందవచ్చు. అలాగే వాటి మరణాల శాతాన్ని కూడా గణనీయంగా తగ్గించవచ్చు.
News April 14, 2026
VJA: బెట్టింగ్ ముఠా గుట్టురట్టు.. ముగ్గురి అరెస్ట్!

బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ఓ ముఠాను పటమట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల మేరకు.. ప్రసాదంపాడుకు చెందిన రాజేశ్ ఫ్యాన్సీ దుకాణం నడుపుతున్నాడు. IPL ప్రారంభం అవ్వగానే సబ్ బుకీ అవతారమెత్తాడు. రాధే ఎక్సేంజ్ బెట్టింగ్ యాప్ ద్వారా బెట్టింగ్ చేస్తున్నాడు. అతనిపై పోలీసులు నిఘా ఏర్పాటు చేసి సోమవారం అదుపులోకి తీసుకున్నారు. అతనికి సహకరిస్తున్న ఆనంద్ రెడ్డి, శివయ్యలను అదుపులోకి తీసుకున్నారు.
News April 14, 2026
కామారెడ్డిలో కూరగాయల ధరలు ఇలా!

కామారెడ్డి మార్కెట్లో కూరగాయల ధరలు మంగళవారం సాధారణంగా కొనసాగుతున్నాయి. మార్కెట్‌లో కేజీ టమాటా రూ.20, బీరకాయ రూ.60, క్యాబేజీ రూ.50, కాకరకాయ రూ.60, ఆలుగడ్డ రూ.30, ఉల్లిపాయ రూ.20గా విక్రయిస్తున్నారు. అలాగే పాలకూర రూ.50, వంకాయ రూ.50, క్యారెట్ రూ.50, చిక్కుడు రూ.50, కాలీఫ్లవర్ రూ.50, క్యాప్సికమ్ రూ.50 ధరలకు లభిస్తున్నాయి. ధరలు స్థిరంగా ఉండటంతో వినియోగదారులు కొంత ఊరట వ్యక్తం చేస్తున్నారు.


