News February 14, 2025
యాపల్‌గూడ బడి రాష్ట్రంలోనే బెస్ట్ స్కూల్: కలెక్టర్

యాపల్‌గూడ ప్రాధమిక పాఠశాలలో గురువారం బాల వికాస్ వాటర్ ప్లాంట్, లైబ్రరీలను కలెక్టర్ రాజర్షిషా ప్రారంభించారు.ఈ సందర్భంగా రీడింగ్ ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. రాష్ట్రంలోనే యాపల్‌గూడ బడి బెస్ట్ స్కూల్ అని కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో DEO ప్రణీత, MEO నర్సయ్య, HM గంగయ్య, గ్రామ పెద్దలు, పేరెంట్స్, అధికారులు పాల్గొన్నారు.
Similar News
News April 14, 2026
ADB: రేపు జిల్లాకు మంత్రి పొన్నం రాక

రాష్ట్ర రోడ్డు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఈ నెల 15న ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. “అరైవ్ అలైవ్” కార్యక్రమంలో ఈ నెల 13 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించే రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా బుధవారం ఆదిలాబాద్‌లో నిర్వహించే పలు కార్యక్రమంలో మంత్రి పాల్గొననున్నారు. ఈ మేరకు ఆర్టీవో అధికారులు మంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను చేపడుతున్నారు.
News April 14, 2026
16 నుండి మండలస్థాయి సదస్సులు : ADB కలెక్టర్

జిల్లాలో ఏప్రిల్ 16వ తేదీన నిర్వహించనున్న ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ మండల స్థాయి సదస్సులను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. నిన్నగూగుల్ మీట్ లో దిశానిర్దేశం చేశారు. సదస్సుల నిర్వహణలో భాగంగా పోషణ్ మాస్ స్టాల్స్‌తో పాటు గర్భిణీలకు సీమంతాల కార్యక్రమాలు చేపట్టాలన్నారు. బాల్య వివాహ రహిత పంచాయతీలుగా తీర్మానం చేసిన గ్రామాలకు గుర్తింపునివ్వాలన్నారు.
News April 14, 2026
ADB: పెళ్లి సంబరాలు కావద్దు విషాదం..!

ఆదిలాబాద్ జిల్లాలో పెళ్లిల జోరు కొనసాగుతోంది. దీంతో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సామూహికంగా వెళ్తుంటారు. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో పరిమితికి మించి లారీలు, ట్రాక్టర్లు వంటి వాహనాల్లో ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. ఇటీవల సిరికొండ మండలానికి చెందిన వాహనం నిర్మల్ సమీపంలో ప్రమాదానికి గురై ఇద్దరు మరణించిన విషయం తెలిసిందే.


