News November 5, 2025
యాలాల్: ‘అధైర్యపడొద్దు.. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది’

రోడ్డు ప్రమాదంలో మరణించిన యాలాల్ మండలానికి చెందిన పలు కుటుంబాలను తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఈరోజు పరామర్శించారు. పేర్కంపల్లి గ్రామానికి చెందిన సాయిప్రియ, నందిని, తనూష కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ప్రకటించిన రూ.7 లక్షల చొప్పున ముగ్గురికి మొత్తం రూ.21 లక్షల చెక్కులను అందజేశారు. అనంతరం లక్ష్మీనారాయణపూర్ గ్రామానికి చెందిన గుర్రాల అఖిల రెడ్డి కుటుంబానికి రూ.7లక్షల చెక్కును అందజేశారు.
Similar News
News January 17, 2026
రేవంత్ తుగ్లక్‌లా వ్యవహరిస్తున్నారు: KTR

TG: సీఎం రేవంత్ తుగ్లక్‌లా వ్యవహరిస్తున్నారని KTR విమర్శించారు. ‘సికింద్రాబాద్ అస్తిత్వాన్ని ప్రభుత్వం దెబ్బతీస్తోంది. SEC కార్పొరేషన్ సాధనకు ర్యాలీ నిర్వహించాలనుకుంటే మా నేతలను నిర్బంధించారు. కోర్టు ద్వారా అనుమతి తీసుకొని ర్యాలీ చేస్తాం. ప్రజా క్షేత్రంలో కాంగ్రెస్‌కు బుద్ధి చెబుతాం’ అని అన్నారు. అటు SECకు చెందిన నార్త్ జోన్ ప్రాంతాలను మల్కాజిగిరి పరిధిలో కలపడం అన్యాయమని BRS ఆరోపిస్తోంది.
News January 17, 2026
ప.గో: మూడు రోజుల్లో చేతులు మారిన రూ.750 కోట్లు

సంక్రాంతి పండుగ వేళ కోర్టు ఆదేశాలు, పోలీసుల ఆంక్షలు బేఖాతరు చేస్తూ ఉమ్మడి గోదావరి జిల్లాల్లో కోడిపందేలు, జూదాలు జోరుగా సాగాయి. కేవలం మూడు రోజుల్లోనే ఈ జిల్లాల్లో సుమారు రూ.750 కోట్లు చేతులు మారడం గమనార్హం. ఇందులో ఉమ్మడి తూర్పుగోదావరి రూ. 500 కోట్లు, పశ్చిమగోదావరి రూ.250 కోట్లతో జూదంలో కొత్త రికార్డులు సృష్టించినట్లు పలు గణంకాలు తెలుపుతున్నాయి.
News January 17, 2026
ఫిబ్రవరి 18 నుంచి యాదగిరిగుట్ట స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వచ్చే నెల 18న ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 18 నుంచి 28 వరకు జరిగే ఈ ఉత్సవాలలో 24న ఎదుర్కోలు, 25న తిరుకల్యాణ మహోత్సవం, 26న దివ్య విమాన రథోత్సవం జరగనున్నాయి. అదేవిధంగా, పాతగుట్టలో శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 28 నుంచి వచ్చే నెల 3 వరకు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.


